MLA Ramesh Latke Died : విహారయాత్రలో విషాదం..దుబాయ్ ట్రిప్ కు వెళ్లిన ఎమ్మెల్యే హాఠాన్మరణం..!

కుటుంబంతో కలిసి నవ్వుతూ సరదాగా దుబాయ్‌ విహారయాత్రకు శివసేన ఎమ్మెల్యే రమేష్ లట్కే హఠాన్మరణం చెందారు. 52 ఏళ్ల రమేష్‌ లట్కే గుండెపోటుతో దుబాయ్ లో కన్నుమూశారు. రమేశ్ మరణంతో శివసేన వర్గాల్లో విషాదం నెలకొంది.

MLA Ramesh Latke Died : విహారయాత్రలో విషాదం..దుబాయ్ ట్రిప్ కు వెళ్లిన ఎమ్మెల్యే హాఠాన్మరణం..!

Shiv Sena Mla Ramesh Latke Died In Dubai Vacation

Updated On : May 12, 2022 / 4:56 PM IST

MLA Ramesh Latke Died : కుటుంబంతో కలిసి నవ్వుతూ సరదాగా దుబాయ్‌ విహారయాత్రకు శివసేన ఎమ్మెల్యే రమేష్ లట్కే హఠాన్మరణం చెందారు. 52 ఏళ్ల రమేష్‌ లట్కే గుండెపోటుతో దుబాయ్ లో కన్నుమూశారు. రమేశ్ మరణంతో శివసేన వర్గాల్లో విషాదం నెలకొంది.

బుధవారం (మే 11,2022)అర్ధరాత్రి శివసేన ఎమ్మెల్యే రమేష్‌ లట్కే దుబాయ్‌లో కన్నుమూశారని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. రమేష్ లట్కే విడిది చేసిన చోటే తీవ్ర గుండెపోటుకు గురై ఆయన కన్నుమూసారు. ఆయన మరణాన్ని శివ సేన వర్గాలు ధృవీకరించాయి. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని శివసేన పార్టీ తెలిపింది.

ఎమ్మెల్యే హఠాన్మరణంతో మహా రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. పార్టీలకతీతంగా నివాళులు అర్పిస్తున్నారు నేతలు. ముంబై అంధేరీ ఈస్ట్‌ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రమేష్‌ లట్కే. ఎమ్మెల్యే కాకముందు బీఎంసీలో కార్పొరేటర్‌గా కూడా పని చేశారు.