Andhra Politics: లా అండ్ ఆర్డర్‌పై పవన్ కల్యాణ్ ఆరా.. ఎందుకీ డిస్కషన్..
ఏపీ కూటమి ప్రభుత్వంలో చిన్న ఇష్యూ కూడా పెద్ద వార్త అవుతోంది. ఒక మంత్రి కామెంట్ చేసినా, డిప్యూటీ సీఎం పవన్ ఇతర శాఖల అధికారుల పనితీరుపై ఆరా తీసినా అది చర్చనీయాంశమవుతోంది. ఏపీ డిప్యూటీ సీఎంగా, సీఎం చంద్రబాబు తర్వాతి స్థానంలో పవన్ కల్యాణ్ ఉన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు సీఎం అంతటి ప్రాధాన్యత దక్కుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ముఖ్యమంత్రి ఫోటో పక్కన పవన్ ఫోటోను ఉంచుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్రపతి, ప్రధాని, సీఎంల ఫోటోలు మాత్రమే ఉంటాయి. అయితే, ఏపీలో పవన్‌కు ఈ ప్రత్యేక హోదాను కల్పిస్తూ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు నిత్యం చర్చకు దారితీస్తున్నాయి. పవన్ తన శాఖల పనులతో పాటు అప్పుడప్పుడూ లా అండ్ ఆర్డర్‌పై కూడా ఆరా తీయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇది విపక్షాలకు అస్త్రంగా మారుతుండగా, పవన్ చొరవపై నిజంగానే రాద్ధాంతం అవసరమా అనే ప్రశ్న తలెత్తుతోంది.
