మహారాష్ట్ర పొలిటికల్ ఎపిసోడ్ : శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతల భేటీ

మహారాష్ట్ర పొలిటికల్ ఎపిసోడ్ క్లైమాక్స్‌కు చేరింది. మహా ప్రతిష్టంభనకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. ముంబైలో.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు 2019, నవంబర్ 22వ తేదీ శుక్రవారం సమావేశం కానున్నారు. ఇప్పటికే.. పదవుల పంపకం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అంతా ఓకే అనుకుంటే.. ప్రభుత్వ ఏర్పాటుపై కీలక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. డైలీ సీరియల్‌గా కొనసాగుతున్న మహారాష్ట్ర రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడే సమయం వచ్చేసింది.
శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్, ఎన్సీపీ సిద్ధమవడంతో.. మరికొన్ని గంటల్లోనే ప్రభుత్వ ఏర్పాటుపై కీలక ప్రకటన వెలువడే అవకాశముంది. అర్ధరాత్రి.. మహారాష్ట్రలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య థాక్రేతో పాటు సంజయ్ రౌత్.. ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్‌తో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
ఎన్సీపీ – శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో జరిగిన CWC సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. డిసెంబర్ ఫస్ట్‌కు ముందే మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని శివసేన మరోసారి స్పష్టం చేసింది. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌పై మూడు పార్టీల మధ్య అవగాహన కుదిరిందని.. కాంగ్రెస్-ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు సంజయ్‌రౌత్ తెలిపారు.
అన్నీ కుదిరితే.. అదివారం గానీ.. సోమవారం గానీ శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఐదేళ్లు సీఎంగా ఉద్ధవ్ థాక్రే ఉంటారా.. లేక రెండున్నరేళ్లు శరద్ పవార్‌కు సీఎంగా చాన్సిస్తారా అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. ఐతే.. డిప్యూటీ సీఎం కుర్చీలో మాత్రం ఐదేళ్లు కాంగ్రెస్ నేతే ఉండనున్నారు. ముంబైలో.. మరోసారి కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీల ముఖ్య నేతలు సమావేశమైన తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Read More : ఉద్ధవ్ సీఎం.. రేపే తుది నిర్ణయం : మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుపై కాంగ్రెస్