మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్ : బీజేపీకి శివసేన అల్టిమేటం

మహారాష్ట్రలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి బీజేపీ-శివసేన కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చినా ప్రభుత్వం ఏర్పాటుపై తాత్సారం

  • Published By: veegamteam ,Published On : October 26, 2019 / 11:51 AM IST
మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్ : బీజేపీకి శివసేన అల్టిమేటం

Updated On : October 26, 2019 / 11:51 AM IST

మహారాష్ట్రలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి బీజేపీ-శివసేన కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చినా ప్రభుత్వం ఏర్పాటుపై తాత్సారం

మహారాష్ట్రలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి బీజేపీ-శివసేన కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చినా ప్రభుత్వం ఏర్పాటుపై తాత్సారం కొనసాగుతోంది. సీఎం పదవిని రెండు పార్టీలు పంచుకోవాలని శివసేన మెలిక పెట్టింది. 50:50 ఫార్ములా ప్రకారమే ప్రభుత్వం ఏర్పడాలని శివసేన కోరుతోంది. బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా రాతపూర్వకంగా హామీ ఇస్తేనే ప్రభుత్వం ఏర్పడుతుందని శివసేన స్పష్టం చేసింది. లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వనంత వరకు బీజేపీ ప్రభుత్వంలో చేరే ప్రసక్తే లేదని శివసేన చెబుతోంది. ఈసారి శివసేనకు సీఎం పదవి ఇవ్వాలని చాలామంది శివసేన ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రతాప్‌ సర్‌నాయిక్‌ అన్నారు.

మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారం దక్కించుకోవాలని భావించిన బీజేపీకి అటువంటి అవకాశం రాలేదు. కచ్చితంగా శివసేనతో కలిసి అధికారాన్ని పంచుకోవాల్సి వచ్చింది. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన చెరో రెండున్నరేళ్లు పంచుకుంటాయి అంటూ వార్తలు వస్తున్నాయి. తొలి రెండున్నరేళ్లు ఫడ్నవిస్.. తర్వాత శివసేన తరఫున ఆదిత్య ఠాక్రే కుర్చీని దక్కించుకుంటారని అంటున్నారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ కూడా ఇదే. ఈసారి ఎన్నికలకు ముందే బీజేపీ, శివసేన కూటమిగా ఏర్పడగా.. గత ఎన్నికలతో పోల్చి చూస్తే బీజేపీ 20కి పైగా స్థానాలను కోల్పోయింది. ఇక శివసేన తన స్థానాలను మాత్రం నిలుపుకుంది.