షాకింగ్ : పాక్ తో శ్రీనగర్ మేయర్ కు లింక్స్ 

  • Published By: veegamteam ,Published On : February 19, 2019 / 04:56 AM IST
షాకింగ్ : పాక్ తో శ్రీనగర్ మేయర్ కు లింక్స్ 

Updated On : February 19, 2019 / 4:56 AM IST

శ్రీనగర్ : పుల్వామాలో భారత సైనికులపై బాంబు దాడి ఘటనపై దేశయావత్తు అట్టుడుకుతోంది. సైనికుల మరణాలు దేశాన్ని కలచివేస్తోంది.ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ రాజధాని శ్రీనగర్ డిప్యూటీ మేయర్ కు పాకిస్థాన్ తో సంబంధాలున్నాయనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారటం సంచలనం కలిగిస్తోంది. 

పాక్ మిలటరీ విభాగం ఐఎస్ఐతో శ్రీనగర్ డిప్యూటీ మేయర్ షేక్ ఇమ్రాన్‌కు సంబంధాలు ఉన్నాయనీ..తన రాజకీయ ప్రత్యర్థులను మట్టుబెట్టడం పెద్ద పనేం కాదని ఆయన మాట్లాడుతున్న వీడియో సంచలనం సృష్టిస్తోంది. శ్రీనగర్ మేయర్ జునైద్ అజిమ్ మట్టు, ఎంపీ సాజద్ లోనే‌లను హతమొందించడానికి ఇమ్రాన్ ప్లాన్స్ వేసినట్లుగా ఆ వీడియో ద్వారా వెల్లడైంది. హిజ్బుల్ ముజాహిద్దిన్ కమాండర్ రియా్ నాయక్‌ ప్రస్తావన కూడా షేమ్ ఇమ్రాన్  తీసుకురావడం గమనించాల్సిన విషయం. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా శత్రు దేశంతో ఓ రాజకీయ నాయకుడు చేతులు కలిపాడనే వార్త విస్మయం కలిగించటంతో పాటు భారతీయుల ఆగ్రహానికి గురిచేస్తోంది.  

ఇష్టమొచ్చినప్పుడు మీ గోడలపై బాంబు దాడులు చేయించగలనంటూ ఇమ్రాన్ మరో వ్యక్తితో మాట్లాడిన మాటలు..నేను ఎవరినైనా కలవాలని చెబితే కశ్మీరీ వేర్పాటు వాద నాయకులైన ఉమర్ ఫరుక్, సయ్యద్ అలీ షా గిలానీ కలుస్తారనీ..తాను వద్దంటే అది జరగదనీ ఇమ్రాన్ తెలిపారు.