మహిళకు మధ్య వేలు చూపించాడని మూడేళ్ల జైలు

మహిళకు మధ్య వేలు చూపించాడని మూడేళ్ల జైలు

Updated On : September 21, 2019 / 9:35 AM IST

న్యూ ఢిల్లీలోని ఓ వ్యక్తి మహిళకు మధ్య వేలు చూపించి జైలు శిక్షకు గురయ్యాడు. 2014లో కేసుపై పలు వాదనల తర్వాత తీర్పు వెలువడింది. బాధిత మహిళ తనకు బావ వరసయ్యే వ్యక్తి మధ్య వేలు చూపించడమే కాకుండా అసభ్యకరంగా ముఖ కవలికలు చూపించి చెంపమీద కొట్టాడని మే 2014న కేసు పెట్టింది. 

నిందితునిపై సెక్షన్ 509, 323ల కింద కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. దీనిపై కోర్టు 2015 అక్టోబరు 8నాటికే తీర్పు వెలువరించింది. అయినప్పటికీ నిందితుడు తనపై మోపిన అభియోగం సరైంది కాదంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. 

ఆమెతో ఆస్తి విభేదాలు ఉండడంతో ఇలాంటి నిందలు వేస్తుందని అతను ఆరోపించాడు. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ వసుంధర ఆజాద్ నిందితుడి చర్యలను హెచ్చరిస్తూ.. మహిళ మర్యాదకు భంగం కలిగించాడని తీర్పునిచ్చింది. కొద్ది రోజుల తర్వాత కేసులో మళ్లీ ఒక మార్పు చోటు చేసుకుంది. తన ఒంటిపై గాయాలయ్యాయని దానికి కూడా అతనే కారణమంటూ అందులో ఉంది. దానిని మెడికో లీగల్ కేసు కింద నమోదు చేశారు. 

మహిళపై ఆరోపించినవన్నీ నిరాధారమైనవని తేలాయి. నలుగురు దగ్గర్నుంచి సాక్ష్యాలు సేకరించి మహిళకే అనుకూలంగా తీర్పు ఇచ్చింది కోర్టు. చాలా రోజుల తర్వాత మంగళవారం ఈ కేసుపై కోర్టు తుది తీర్పు విడుదల చేస్తూ మూడేళ్ల జైలు శిక్ష విధించింది.