Siddaramaiah : అసెంబ్లీలో సీరియస్ డిస్కషన్..ఊడిపోయిన సిద్దరామయ్య పంచె

కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల మైసూర్‌లో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై కాంగ్రెస్ సీనియర్ లీడర్,మాజీ సీఎం సిద్దరామయ్య సభలో నిలబడి సీరియస్‌‌గా

Siddaramaiah : అసెంబ్లీలో సీరియస్ డిస్కషన్..ఊడిపోయిన సిద్దరామయ్య పంచె

Sidhu

Updated On : September 23, 2021 / 5:37 PM IST

Siddaramaiah కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల మైసూర్‌లో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై బుధవారం కాంగ్రెస్ సీనియర్ లీడర్,మాజీ సీఎం సిద్దరామయ్య సభలో నిలబడి సీరియస్‌‌గా మాట్లాడుతున్న సమయంలో ఆయన పంచె ఊడిపోబోయింది. దీన్ని గమనించిన వెంటనే కాంగ్రెస్ రాష్ట్ర అద్యక్షుడు డీకే శివకుమార్ సిద్దరామయ్య దగ్గరకు వెళ్లి.. పంచె ఊడుతున్న విషయాన్ని ఆయన చెవిలో  చెప్పారు.

READ Gang Rape : బాలికపై 29మంది గ్యాంగ్ రేప్

వాదనలో మునిగిపోయిన సిద్దరామయ్య.. పంచె ఊడుతుందని డీకే శివకుమార్ చెప్పగానే ‘ఓహ్.. ఔనా’ అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. వెంటనే సిద్దరామయ్య తన సీటులో కూర్చుకున్నారు. పంచె సరి చేసుకున్నాక ప్రసంగాన్ని కొనసాగిస్తానని అన్నారు. దీంతో అప్పటివరకు గంభీరంగా ఉన్న సభ ఒక్కసారిగా ఘొల్లుమన్నది. సభ్యులందరూ నవ్వుకున్నారు. సభాపతి మధు బంగారప్ప సహా కాంగ్రెస్ సభ్యులు, బీజేపీ నేతలూ తలా ఓ కామెంట్ వేస్తూ నవ్వులు పూయించారు.

పంచెను సరిచేసుకున్న తర్వాత సిద్దరామయ్య మాట్లాడుతూ.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత తాను 4-5 కేజీలు పెరిగానని, ఈ క్రమంలో తన పొట్ట కూడా పెరుగడంతో నిలబడి మాట్లాడుతున్నప్పుడు పంచె ఊడిపోబోయిందని చెప్పారు. సిద్దరామయ్య అన్న మాటలకి.. అధికారపక్ష నేతలు ఏమైనా సహాయం కావాలా అంటూ పరిహాసం అడిగారు. అయితే మీరు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి మీ సహాయం మేం కోరబోమని సిద్దరామయ్య చమత్కరించారు.