ఆదర్శం: సింపుల్ గా ఐఏఎస్ అధికారుల పెళ్లి

ఈ రోజుల్లో మధ్యతరగతి వాళ్ల వివాహం అంటేనే లక్షల్లో ఖర్చు. కొంచెం పేరు, పరపతి డబ్బు ఉన్నవాళ్లైతే కోట్లలో ఖర్చు. పెళ్లి అంటే పందిళ్లు.. తప్పట్లు , తాళాలు, నగలు, దుస్తులు, విందు భోజనాలు, పెళ్లి మండం ఇలా ఒకటా, రెండా అనేకం ఉంటాయి. అందులోనూ ఇద్దరు ఐఏణఎస్ అధికారుల పెళ్లి అంటే ఇంకెలా ఉండాలి. సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఫిల్మ్ స్టార్లు.. అందరూ హాజరై హడావుడి హడావుడి చేయాలి. కానీ అందుకు భిన్నంగా ఇద్దరు ఐఏఎస్ అధికారులు చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు.
విజయవాడకు చెందిన ఐఏఎస్ అధికారి హెప్సిబా రాణి, కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి ఉజ్వల్ ఘోష్ ను పెళ్లాడింది. వీరి వివాహం కర్ణాటక లోని హుబ్బల్లీలో ఉన్న విధాన్ సౌధలో నిరాడంబరంగా జరిగింది. బంధుమిత్రుల సమక్షంలో చాలా సింపుల్ గా చేసుకోవడంపై ప్రశంసలు వెళ్లువెత్తుతున్నాయి. నిరాడంబరంగా పెళ్లి చేసుకుని అనేకమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని వారిని కొనియాడుతున్నారు. 2011 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన కొర్లపాటి హెప్సిబా రాణి ఉడిపి కలెక్టర్ గా పని చేస్తున్నారు. పశ్చిమ బంగాకు చెందిన ఉజ్వల్ ఘోష్.. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివి తర్వాత సివిల్ సర్వీసెస్ కు ఎంపికయ్యారు. ఉజ్వల్ ఘోష్ 2018 కర్ణాటక ఎన్నికల్లో ఉత్తమ సేవలు అందించినందుకుగాను ఎలక్షన్ కమీషనర్ నుండి ఉత్తమ సీఈఓగా అవార్డు అందుకున్నారు.