వానరాన్ని కాపాడిన ఆటోవాలాలు

వానరాన్ని కాపాడిన ఆటోవాలాలు

Updated On : March 17, 2021 / 4:32 PM IST

ముంబై : ఓ వానరం విషయంలో ఆటోవాలాలు పెద్ద మనసుని చాటుకున్నారు. కొద్దో గొప్పో వచ్చే తమ ఆదాయంతోనే గాయపడిన ఓ కోతికి చికిత్స చేయిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మనిషి గాయపడితేనే పట్టించుకోని రోజుల్లో ముంబైలో కొందరు ఆటోవాలాలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ వానరాన్ని (కోతి) కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు.విద్యుత్ షాక్‌తో తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన పడిపోయిన కోతిని వెంటనే వెటర్నరిటీ ఆస్పత్రిలో చేర్చి..వారం రోజులుగా వైద్యానికి అయ్యే ఖర్చును భరిస్తున్నారు.

 

ముంబైలోని మన్‌కుర్ద్ ప్రాంతంలో ఓ వారంరోజుల క్రితం ఆటో స్టాండ్ లో మూలుగు దీనవస్థలో పడి ఉన్న కోతికి శరీరమంతా కాలిన గాయాలతో పడి ఉంది. దాని దుస్థితి చూసి చలించిపోయిన ఆటోవాలాలకు కాసేపు ఏం చేయాలతో తోచలేదు.. వెటర్నిటీ ఆస్పత్రి కోసం చుట్టుపక్కల వాకబు చేశారు. వెతగ్గా వెతగ్గా చివరికి ఓ చోట పశువుల ఆసుపత్రి ఉందని తెలుసుకుని అక్కడ చేర్పించి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. దానికి అయ్యే ఖర్చును రోజువారీ సంపాదించే డబ్బులో తలా కొంచెం వేసుకుని చికిత్స చేయిస్తున్నారు. విద్యుత్ వల్ల అయిన గాయాలు అంత త్వరగా మానిపోవనీ..కొంచెం రోజులు..వారాలు పడుతుందని వైద్యలు తెలిపారు. ఈ క్రమంలో తమకు వచ్చే కొద్దిపాటి సంపాదనలోంచి వారు ఆ కోతి చికిత్సను భరిస్తున్నారు.