Jagannath Rath Yatra Tragedy : జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి.. విద్యుత్ షాక్ తో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మృతి
పెద్ద సంఖ్యలో ప్రజలు ఇనుముతో చేసిన రథాన్ని జనం లాగుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ హైటెన్షన్ వైర్లను రథం తాకింది. దీంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తో మంటలు చెలరేగాయి.

Jagannath Rath Yatra
Electric Shock Six Died : త్రిపురలో జగన్నాథ స్వామి ఉల్టా రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు దుర్మరణం చెందారు. ఉనాకోటి జిల్లా కుమార్ ఘాట్ లో బుధవారం సాయంత్రం జగన్నాథుడి ఉల్టా రథయాత్ర నిర్వహించారు. ఇటీవల జగన్నాథ రథయాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. బుధవారం జగన్నాథ ఉల్లా రథయాత్ర నిర్వహించారు.
ఈ వేడుకకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇనుముతో చేసిన రథాన్ని జనం లాగుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ హైటెన్షన్ వైర్లను రథం తాకింది. దీంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తో మంటలు చెలరేగాయి. విద్యుత్ షాక్ తో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
Saichand Passed Away : తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం
మరో 15 మందికి గాయాలు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొంమంతి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మాణిక్ సాహా సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.