Corona : 60 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్

శ్రీ చైతన్య రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏకంగా 60 మంది విద్యార్థులు కరోనా వైరస్‌ బారినపడ్డారు. 480 మందికి పరీక్షలు చేయగా 60 మందికి కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు.

Corona : 60 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్

Corona

Updated On : September 29, 2021 / 8:56 PM IST

Corona : దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. వరుసగా రెండో రోజు దేశంలో రోజువారీ కేసులు 20వేలకు దిగువన నమోదయ్యాయి. అయితే కర్ణాటక బెంగుళూరులోని శ్రీ చైతన్య రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏకంగా 60 మంది విద్యార్థులు కరోనా వైరస్‌ బారినపడ్డారు. 60 మంది విద్యార్థులకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, అందులో ఇద్దరికి మాత్రమే కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని జిల్లా అధికారులు వెల్లడించారు.

Read More : Telangana : ఏపీ ఉద్యోగుల బదిలీపై తెలంగాణ ప్రభుత్వం సర్క్యులర్

మరికొన్ని రోజు రాష్ట్రంలో ప్రాథమిక పాఠళాలలు ప్రారంభించాలనుకున్న ప్రభుత్వాని ఈ కేసులు ఆందోళనకరంగా మారాయి. 480 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 60 మందికి పాజిటివ్ వచ్చినట్లు బెంగుళూరు అర్బన్‌ జిల్లా కమిషనర్‌ జే. మంజునాథ్‌ తెలిపారు. వారంతా 11, 12 తరగతులకు చెందిన విద్యార్థులని పేర్కొన్నారు.

Read More : Aquila Restaurant : చీర కట్టుకురావద్దన్న రెస్టారెంట్ మూతపడనుంది