సోనూ అంటే సాయం: పోలీసులకు 25వేల ఫేస్ షీల్డ్స్ విరాళం

బాలీవుడ్ నటుడు సోను సూద్ మహారాష్ట్రలో పోలీసు సిబ్బందికి 25 వేల ఫేస్ షీల్డ్స్ ఇచ్చినట్లు రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ వెల్లడించారు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో బాలీవుడ్ నటుడు సోను సూద్ మెస్సీయగా అవతరించాడు.
సోనూ మొదట వందలాది మంది కార్మికులను వారి ఇళ్లకు చేర్చడంలో సహాయం చేశాడు. ఇప్పుడు 25వేల ఫేస్ షీల్డ్స్‌ను ముంబై పోలీసులకు విరాళంగా ఇచ్చాడు.
ఈ మేరకు ట్విట్టర్‌లో మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ సోను సూద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు సిబ్బందికి 25 వేల ఫేస్ షీల్డ్స్ ఇచ్చే పవిత్రమైన పనిని చేసిన సోను సూద్‌కి నా కృతజ్ఞతలు. అంటూ అనిల్ దేశ్ ముఖ్ ట్వీట్ చేశారు.
దీనిపై స్పందించిన సోనూ సూద్.. మీ వినయపూర్వకమైన మాటలు గౌరవంగా భావిస్తున్నాను. మన పోలీసు సోదరులు నిజమైన హీరోలు. వారి ప్రశంసనీయమైన పనికి ప్రతిఫలంగా నేను ఇది చేయగలిగాను. జై హింద్. అని రాసుకొచ్చారు.
లాక్‌డౌన్ సమయంలో, మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలను వారి ఇళ్లకు పంపడం ద్వారా సోనూ తొలిసారి సేవ ప్రారంభించారు. బస్సులు మరియు విమానాల ద్వారా వందలాది మంది కార్మికులను మరియు విద్యార్థులను వారి స్వగ్రామాలకు మరియు భూభాగాలకు పంపారు సోనూ. మొత్తం ఖర్చును సోను భరించారు.
అప్పట్లో సోనూ ప్రజలను చేరుకోవడానికి హెల్ప్ లైన్ కూడా ప్రారంభించాడు. ట్విట్టర్, వాట్సాప్ ద్వారా ప్రజలను చేరుకోవడానికి ప్రయత్నించాడు. సోను చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు వచ్చాయి.