బీసీసీఐ బాస్: నామినేషన్ వేసిన గంగూలీ.. ఎంపిక ఇక లాంఛనమే

ప్రపంచంలోకెల్లా ధనిక క్రికెట్ బోర్డు.. ప్రపంచ క్రికెట్‌ను శాసించే క్రికెట్ బోర్డుడ బీసీసీఐ. అటువంటి బీసీసీఐ అధ్యక్ష పదవికి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ నామినేషన్ వేశారు. ముంబయిలోని బీసీసీఐ కార్యాలయానికి వచ్చిన గంగూలీ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. గంగూలీ నామినేషన్ వేసిన సమయంలో బీసీసీఐ మాజీ అధ్యక్షులు నిరంజన్ షా, ఎన్ శ్రీనివాసన్, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఉన్నారు.
గంగూలీతో పాటు పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శి పదవికి నామినేషన్ వేయగా.. ట్రెజరర్‌గా అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ ధూమల్ నామినేషన్ వేశారు. అక్టోబరు 23న బీసీసీఐ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లకు నేటితో ఆఖరి తేదీగా బోర్డు ప్రకటించింది. ఇప్పటివరకు అధ్యక్ష పదవికి గంగూలీ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక లాంఛనప్రాయయం కానుంది.
తొలుత అధ్యక్ష పదవికి శ్రీనివాసన్ సన్నిహితుడు బ్రిజేష్ పటేల్ నుంచి గట్టి పోటీ వచ్చినా కూడా అనధికారికంగా జరిగిన ఓ సమావేశంలో అనేక రాష్ట్రాల సంఘాల ప్రతినిధులు గంగూలీకే మద్దతు పతకడంతో బీసీసీఐ అధ్యక్ష ఎంపికకు మార్గం సుగమం అయింది.