Sourav Ganguly : సీఎం మమతా బెనర్జీ వెంట స్పెయిన్ పర్యటనకు వెళ్లనున్న కలిసి సౌరవ్ గంగూలీ
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి ఈ నెలాఖరులో స్పెయిన్‌కు వెళ్లనున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సౌరవ్ గంగూలీ సీఎంతో కలిసి వెళ్లనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి....

Ganguly, Mamata Banerjee
Sourav Ganguly : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి ఈ నెలాఖరులో స్పెయిన్‌కు వెళ్లనున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సౌరవ్ గంగూలీ సీఎంతో కలిసి వెళ్లనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. మమతా బెనర్జీ సెప్టెంబర్ 12వతేదీన స్పెయిన్‌కు వెళ్లనున్నారు. (Sourav Ganguly to join Mamata Banerjee ) ఆమె పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి స్పెయిన్ వ్యాపార వర్గాలతో పలు సమావేశాలు నిర్వహిస్తారు.
Egyptian billionaire : ఈజిప్ట్ బిలియనీర్ మొహమ్మద్ అల్ ఫాయెద్ కన్నుమూత
సౌరవ్ గంగూలీ బార్సిలోనాలో ముఖ్యమంత్రితో కలిసి సమావేశాల్లో పాల్గొననున్నారు. (Spain visit to woo investors) రాజకీయాల్లోకి ప్రవేశించడం గురించి పెదవి విప్పకుండా ఉన్నప్పటికీ, గంగూలీ పశ్చిమ బెంగాల్‌ను పెట్టుబడులను రాబట్టడానికి ప్రచారం చేయడంలో ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం.
Jet Airways : బ్యాంకు మోసం కేసులో జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ అరెస్ట్
మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రతినిధి బృందంలో కొంతమంది పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ శాఖలకు చెందిన మరికొందరు అధికారులు కూడా ఉన్నారు. స్పెయిన్ నుంచి తిరిగి వచ్చే సమయంలో వారు దుబాయ్‌ని కూడా సందర్శిస్తారని ఒక అధికారి చెప్పారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెప్టెంబర్ 23వతేదీన తిరిగి వస్తారని అధికారులు తెలిపారు.