Railway: ఘోరంగా నష్టపోయిన రైల్వే.. అన్ని రకాలుగా ఎదురుదెబ్బలే

రైల్వే శాఖ ఆదాయంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ప్రయాణికుల టిక్కెట్ల రూపంలో భారీగా నష్టపోయింది. లాక్‌డౌన్‌లో ప్రయాణికుల రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ ఆ తర్వాత ప్రత్యేక పేరుతో వాటిని పట్టాలెక్కించి దశలవారీగా సంఖ్య పెంచుతూ వస్తోంది.

Railway: ఘోరంగా నష్టపోయిన రైల్వే.. అన్ని రకాలుగా ఎదురుదెబ్బలే

Railway

Updated On : March 15, 2021 / 8:16 AM IST

Railway: రైల్వే శాఖ ఆదాయంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ప్రయాణికుల టిక్కెట్ల రూపంలో భారీగా నష్టపోయింది. లాక్‌డౌన్‌లో ప్రయాణికుల రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ ఆ తర్వాత ప్రత్యేక పేరుతో వాటిని పట్టాలెక్కించి దశలవారీగా సంఖ్య పెంచుతూ వస్తోంది. 2020-21లో మార్చి వరకూ ప్రయాణికుల రిజర్వు టికెట్ల ద్వారా 13వేల 29కోట్ల ఆదాయం వచ్చింది.

క్రితం ఏడాదితో పోలిస్తే 62.92శాతం ఆదాయం తగ్గింది. అన్‌రిజర్వ్‌డ్ టికెట్లతో రూ.వెయ్యి 56కోట్ల ఆదాయమే వచ్చింది. ప్యాసింజర్ రైళ్లను తక్కువగా నడపడంతో 94.09శాతం ఆదాయం తగ్గింది. లాక్‌డౌన్‌లో గూడ్స్ రైళ్లను అదనంగా నడిపే అవకాశం వచ్చినా సరకు రవాణా ఆదాయం పెరగలేదు. వెయ్యి 133 మిలియన్ టన్నుల సరకుల్ని రవాణా చేయగా రూ.లక్షా 9వేల 67కోట్ల ఆదాయం వచ్చింది.

ఇది 2019-20తో పోలిస్తే 5.91శాతం తక్కువ. ప్రయాణికుల రైళ్లలో సెకండ్ సిట్టింగ్ టికెట్ల ఆదాయం మాత్రం 96శాతం పెరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వే 2019-20తో పోలిస్తే 2020-21లో రూ.3217 కోట్ల ఆదాయం కోల్పోయింది.

సరకు రవాణా: సౌత్ సెంట్రల్ రైల్వేకు గతేడాది రూ.8వేల 876కోట్ల ఆదాయం రాగా, ఈ సారి రూ.7వేల 665కోట్లకు పరిమితమైంది. గతేడాదితో పోలిస్తే ఇది 13.64శాతం తక్కువ.

ప్రయాణికుల సంఖ్య: దక్షిణ మధ్య రైల్వే 2020-21లో 1.99కోట్ల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చింది. క్రితం సంవత్సరంలో ఈ సంఖ్య 5.44కోట్లు, దేశ వ్యాప్తంగా రిజర్వుడు ప్రయాణికుల సంఖ్య చూస్తే ఈ ఏడాది 24.61కోట్ల మంది ప్రయాణించారు. 2019-20తో పోలిస్తే 58.21శాతం తక్కువ.