Venkateswara swamy: మే4 నుంచి ఢిల్లీలో శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
మే 4 నుండి 12వ తేదీ వరకు ఢిల్లీ గోల్ మార్కెట్ వద్ద టీటీడీ ఆలయంలో ఘనంగా శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.

Tirumala Tirupathi Devasthanam
Venkateswara swamy: ఢిల్లీలో శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మే 4 నుండి 12వ తేదీ వరకు ఢిల్లీ గోల్ మార్కెట్ వద్ద టీటీడీ ఆలయంలో ఘనంగా శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. మే 3న సాయంత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల ముందు ఏప్రిల్ 25వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(ఆలయ శుద్ధి). మే 4వ తేదీ ఉదయం 8.30 నుండి 9.30 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమం ఉంటుంది.
Venkateswara swamy temple : జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన టీటీడీ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహన సేవలు. మే 13వ తేదీన సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వహణ ఉంటుంది.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు..
♦ 4-05-2023 ఉదయం – ధ్వజారోహణం, రాత్రి – పెద్దశేష వాహనం.
♦ 5-05-2023 ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి – హంస వాహనం.
♦ 6-05-2023 ఉదయం – సింహ వాహనం, రాత్రి – ముత్యపుపందిరి వాహనం.
♦ 7-05-2023 ఉదయం – కల్పవృక్ష వాహనం, రాత్రి – సర్వభూపాల వాహనం.
♦ 8-05-2023 ఉదయం – మోహినీ అవతారం, సాయంత్రం – కల్యాణోత్సవం, రాత్రి – గరుడ వాహనం.
♦ 9-05-2023 ఉదయం – హనుమంత వాహనం, రాత్రి – గజవాహనం.
♦ 10-05-2023 ఉదయం – సూర్యప్రభ వాహనం, రాత్రి – చంద్రప్రభ వాహనం.
♦ 11-05-2023 ఉదయం – రథోత్సవం, రాత్రి – అశ్వ వాహనం.
♦ 12-05-2023 ఉదయం – చక్రస్నానం, రాత్రి – ధ్వజావరోహణం.