పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు

ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది.

పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు

Puri Jagannath Rath Yatra 2025

Updated On : June 29, 2025 / 10:01 AM IST

Puri Jagannath Rath Yatra 2025: ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన వార్షిక రథోత్సవంలో గుండిచా ఆలయం వద్ద భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మృతి చెందారు. మరికొందరు భక్తులకు గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ప్రభాతి దాస్, బసంతి సాహూ అనే ఇద్దరు మహళలు ఉండగా.. ప్రేమ్ కాంత్ మొహంతి అనే 70ఏండ్ల వృద్ధుడు ఉన్నారు. వీరంతా ఒడిశాలోని ఖుద్రా జిల్లాకు చెందిన వారుగా తెలిసింది.

Also Read: హిమాచల్‌ ప్రదేశ్‌లో ‘పుష్ప’ మూవీ సీన్.. ‘హిమాచల్ పుష్పరాజ్ ఎక్కడ..?’ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్.. వీడియో వైరల్

ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జగన్నాథుడు, అతని తోబుట్టువులు బలధ్రుడు, సుభద్రా దేవితో కూడిన రథాలు ప్రధాన ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయానికి చేరుకున్నాయి. రథాలను లాగేందుకు, జగన్నాథుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ముందు వరుసలోకి చేరుకున్నారు. రథం చుట్టూ ఉండే భద్రతా గదులు తక్కువగా ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఒకేచోటుకి చేరుకోవటంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.
పోలీసులు రథాన్ని ఆపే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే ముగ్గురు మరణించగా.. పలువురికి గాయాలయ్యాయి. పూరి జిల్లా అధికారులు, ఎమర్జెన్సీ రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకిదిగి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

పూరీ రథయాత్రకు శనివారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శనివారం రథయాత్ర ముగిసిన తరువాత జగన్నాథ ఆలయం నుంచి రథాలు శారద బలి వద్దకు చేరుకున్నాయి. శనివారం రథయాత్రలో దాదాపు 750 మంది భక్తులు అస్వస్థతకు గురైనట్లు, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. తీవ్ర అనారోగ్యానికి గురైన వారిని కటక్ లోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.