Cyclone : అరేబియా సముద్రంలో తుపాన్.. వాతావరణ శాఖ హెచ్చరిక జారీ

అరేబియా సముద్రంలో తుపాన్ ఏర్పడింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న లక్షద్వీప్ ప్రాంతంలో ఏర్పడిన తుపాను వల్ల వచ్చే 48 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది....

Cyclone : అరేబియా సముద్రంలో తుపాన్.. వాతావరణ శాఖ హెచ్చరిక జారీ

Cyclone

Updated On : October 17, 2023 / 1:57 PM IST

Cyclone in Arabian Sea : అరేబియా సముద్రంలో తుపాన్ ఏర్పడింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న లక్షద్వీప్ ప్రాంతంలో ఏర్పడిన తుపాను వల్ల వచ్చే 48 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. తుపాన్ తీవ్రమైతే అరేబియా సముద్రంలో రుతుపవనాల తర్వాత ఏర్పడే తొలి తుపాను ఇదే అవుతుంది. రానున్న 48 గంటల్లో ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ ఒక ప్రకటనలో తెలిపింది.

Also Read : భూ దండయాత్రకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్‌కు హమాస్ హెచ్చరిక

వాతావరణ వ్యవస్థ పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి అక్టోబర్ 21వతేదీ నాటికి మధ్య అరేబియా సముద్రం మీదుగా అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముంబయి సముద్ర తీరంలో తుపాన్ ప్రభావం వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ముంబయి, పూణే ప్రాంతాల్లో తుపాన్ ప్రభావం వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.

Also Read : పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి, ఇద్దరికి గాయాలు

2021వ సంవత్సరంలో టౌక్టే తుపాన్ ప్రభావం వల్ల ముంబయిలో 169 మంది మరణించారు.2020వ సంవత్సరంలో నిసర్గ తుపాన్ వల్ల ఆరుగురు మరణించారు. ముంబయి సముద్ర తీర ప్రాంతాల్లో తుపాన్ వల్ల నష్టం జరిగే అవకాశముంది.