సందేశం కోసం : చీరలు కట్టుకుని వచ్చిన మగ విద్యార్థులు

  • Published By: madhu ,Published On : January 4, 2020 / 08:19 AM IST
సందేశం కోసం : చీరలు కట్టుకుని వచ్చిన మగ విద్యార్థులు

Updated On : January 4, 2020 / 8:19 AM IST

కాలేజీలో ఓ ఫెస్టివల్ జరుగుతోంది. అందరూ విభిన్నమైన వస్త్రధారణలో వచ్చారు. డిఫరెంట్ స్టయిల్స్‌లో విద్యార్థులు రావడంతో కళాశాల ప్రాంగణం సందడి సందడి నెలకొంది. కానీ ముగ్గురు మేల్ స్టూడెంట్స్ ధరించిన వస్త్ర ధారణ అందర్నీ ఆశ్చర్యపరించింది. ఎందుకంటే వారు కట్టుకుంది చీర. కానీ ఎందుకు ఈ వేషధారణ వేయాల్సి వచ్చిందో తెలుసుకున్నాక..అందరూ హాట్సాఫ్ చెప్పారు. ఈ ఘటన పూణేలో  చేసుకుంది. 

వివరాల్లోకి వెళితే..పూణేలోని ఫెర్గూసన్ కాలేజీలో ప్రతి సంవత్సరం వార్షిక వేడుకల్లో భాగంగా ఒక థీమ్‌‌ను ఎంచుకుంటూ ఫెస్టివల్ నిర్వహిస్తుంటుంది యాజమాన్యం. ఈసారి Tie And Sari Day ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అందరూ డిఫరెంట్.., డిఫెరంట్ వస్త్రధారణలో వచ్చారు. అదే కాలేజీలో చదువుతున్న ఆకాశ్ పవార్, రుషికేష్ సనాఫ్, సుమిత్‌లు మాత్రం చీరలు ధరించి రావడంతో అందరూ నోరెళ్లబెట్టారు. కొంతమంది అయితే..నవ్వుకున్నారు. 

దీనిపై ఆకాశ్ మాట్లాడుతూ…మగవారు ప్యాంటు, షర్టు ధరించాలని, ఆడవారు చీరలు, సల్వార్, కుర్తాలు ధరించాలని ఎక్కడా చెప్పలేదన్నారు. లింగసమానత్వం గురించి చెప్పాలని అనుకుని చీరలు ధరించి రావడం జరిగిందన్నారు. సుమిత్ కూడా రెస్పాండ్ అయ్యాడు. చీరలు ధరించే సమయంలో తాము తీవ్ర ఇబ్బందులు పడడం జరిగిందని, స్నేహితురాలు శద్ధా సాయం తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే శారీని కట్టుకుని నడవాలంటే..తాము ఎన్నో కష్టాలు పడడం జరిగిందన్నారు. తమకు సహాయం చేసిన శ్రద్ధాకు థాంక్స్ చెబుతున్నామని, లింగ వివక్ష లేకుండా అందరూ సమానమేనని స్పష్టం చేశారు. 

వీరు చేసిన ప్రయత్నాన్ని కాలేజీ యాజమాన్యం అభినందించింది. ప్రతొక్కరూ వారిని మెచ్చుకుని ఫొటోలు తీసుకుంటున్నారు. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.