పిల్లలు కాదు చిచ్చర పిడుగులు : ఫీట్స్ చూస్తే..దిమ్మ తిరిగిపోద్ది

కొంతమంది పిల్లలు చేసే పనులు చూస్తే.. వీళ్లు పిల్లాలా లేక చిచ్చర పిడుగులా? అంటాం. ఈ మాటకు చక్కగా సరిపోతారు ఈ స్కూల్ విద్యార్థులు. కళ్లు చెదిరే ఫీట్స్ చేస్తున్నారు. ట్రైనింగ్ ఉంటే తప్ప చేయలేని ఫీట్స్ ను స్కూల్ బ్యాగ్ భుజాన వేసుకుని..ఈజీగా చేసేస్తున్నారు పశ్చిమబెంగాల్‌లోని స్కూల్ విద్యార్థులు.
వీరు ఫీట్స్ తో అందరినీ ఆకర్షిస్తున్నారు. ఈ ఇద్దరు విద్యార్థులు రోడ్డుపై ఒకర్ని మించిన మరొకరు చేసిన ఫీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిలో విద్యార్థిని చేసిన ఫీట్ అయితే వావ్..అని అనిపిస్తుంది. గాల్లోనే పల్టీలు భలే కొట్టింది.
ఆ పిల్లలు ఇద్దరు రోడ్డుపై ఒకేసారి గాల్లో పల్టీలు కొట్టారు. ఇది చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. అయితే రోడ్డుపై ఇలాంటి విన్యాసాలు చేయడం చాలా ప్రమాదకరమని కూడా కొంతమంది సూచిస్తున్నారు. పిల్లలా మజాకా అనిపిస్తున్నారు.
எலேய் 2010 கிட்ஸுகளா..
சூப்பர்டா ? pic.twitter.com/xfosGIUC9n— பட்டாசு (@pattaasu) August 24, 2019