భారీ ఊరట: చిదంబరానికి బెయిల్

  • Published By: vamsi ,Published On : October 22, 2019 / 05:32 AM IST
భారీ ఊరట: చిదంబరానికి బెయిల్

Updated On : October 22, 2019 / 5:32 AM IST

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పీ చిదంబరానికి భారీ ఊరట లభించింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్ట్‌ అయి తీహార్‌ జైలులో ఉంటున్న చిదంబరానికి సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. చిదంబరం అరెస్టయిన రెండు నెలల తర్వాత ఆయనకు బెయిల్‌ లభించింది.

సీబిఐ నమోదు చేసిన ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో తనకు బెయిల్‌ నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ చిదంబరం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

మరోవైపు ఇదే కేసులో ఈడీ కస్టడీలో ఉండటంతో చిదంబరం జైలులోనే గడపాల్సి ఉంది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కేసులో చిదంబరంను ఆగస్ట్‌ 21న  సీబీఐ అరెస్ట్‌ చేసింది.

ఈ కేసులో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంతో పాటు మరికొందరు ఉన్నతాధికారులపైనా సీబీఐ చార్జిషీట్‌ నమోదు చేసి ఉంది.