Maharashtra : మహారాష్ట్ర ఆరే అటవీ ప్రాంతంలో చెట్లు నరికివేత.. ముంబై మెట్రోకు రూ.10 లక్షల జరిమానా

ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ సీఈవోను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. నిర్దేశించిన గుడువులోగా అటవీ పునరుద్ధరణ చర్యలను పూర్తి చేయాలని సూచించింది. దీనిని పరిశీలించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఐఐటీ బాంబేను కోరింది.

Maharashtra : మహారాష్ట్ర ఆరే అటవీ ప్రాంతంలో చెట్లు నరికివేత.. ముంబై మెట్రోకు రూ.10 లక్షల జరిమానా

Maharashtra

Updated On : April 17, 2023 / 9:52 PM IST

Maharashtra : మహారాష్ట్రలోని ఆరే అటవీ ప్రాంతంలో కోర్టు అనుమతికి మించి చెట్లను నరికివేశారు. దీంతో ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆ సంస్థకు రూ.10 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తం డబ్బును రెండు వారాల్లో చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా సంస్థ అధికారులను జైలుకు పంపుతామని హెచ్చరించింది. ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ సీఈవోను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. నిర్దేశించిన గుడువులోగా అటవీ పునరుద్ధరణ చర్యలను పూర్తి చేయాలని సూచించింది.

దీనిని పరిశీలించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఐఐటీ బాంబేను కోరింది. ముంబై నగరానికి ప్రాణ వాయువుగా పేర్కొనే ఆరే అటవీ ప్రాంతంలో మెట్రో రైల్ షెడ్ నిర్మాణాన్ని గతంలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం నిలిపివేసింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రభుత్వం మారడంతో సీఎం ఏక్ నాథ్ షిండే ఈ ప్రాజెక్టు కొనసాగింపుపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారీగా చెట్లను నరికివేశారు. అటవీ సంరక్షణ కార్యకర్తలతోపాటు స్థానికులు ఈ చర్యను వ్యతిరేకిస్తున్నారు.

Forest Act: చెట్లు నరికితే ఇకపై జైలు శిక్ష కాదు.. రూ.500 ఫైన్!

2019 నవంబర్ లో సుప్రీంకోర్టు ఆమోదించిన యథాతథ స్థితిని ఉల్లంఘించడంపై కొందమంది కోర్టును ఆశ్రయించారు. 84 చెట్లను తొలగించేందుకు కోర్టు అనుమతించగా ముంబై మెట్రో సంస్థ 177 చెట్లను నరికివేసిందని ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై సోమవారం విచారణ చేపట్టింది. ముంబై మెట్రో రైల్ సంస్థ తరుపున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆ సంస్థ చర్యను సమర్థించేందుకు ప్రయత్నించారు.

2019లో 84 చెట్ల నరికివేతకు కోర్టు అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. అనంతరం కాలంలో అక్కడి మొక్కలు చెట్లుగా పెరిగాయని చెప్పారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు సీయూ సింగ్, గోపాల్ శంకరనారాయణ కూడా తమ వాదనలు ట్రిమ్ చేసేందుకు అనుమతించిన చెట్లను కూడా నరికివేసినట్లు ఆరోపించారు. ఇరువైపు వాదనలు విన్న సుప్రీంకోర్టు ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ చర్యను తప్పుబట్టింది.

Environment : చెట్లకు దేవుడి ఫోటోలు అంటిస్తున్నాడు…ఎందుకో తెలిస్తే మీరు అదే పనిచేస్తారు…

కోర్టు ఆదేశాలను ధిక్కరించి అనుమతించిన దాని కంటే ఎక్కువగా చెట్లను నరికివేయడంపై మండిపడింది. రెండు వారాల్లో రూ.10 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అలాగే అటవీకరణను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సూచించింది. దీనిని పరిశీలించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఐఐటీ బాంబే డైరెక్టర్ ను కోరింది. దీనికి సంబంధించిన నివేదికను మూడు వారాల్లో కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం పేర్కొంది.