Supreme Court : కిసాన్ మహాపంచాయత్‌కు సుప్రీం చీవాట్లు
జంతర్ మంత్ వద్ద ధర్నా కోరుతూ...కిసాన్ మహా పంచాయత్ పిటిషణ్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీం స్పందించింది.

Mahapanchayat
Kisan Mahapanchayat : జాతీయ రహదారులను నిర్భందించి…ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు..కోర్టును ఆశ్రయించిన సమయంలో…నిరసనలు చేపట్టడంలో అర్థం లేదు..నిరసన తెలిపే హక్కు రైతులకు ఉంటుంది..అయితే రహదారులను నిర్భందించడం సరైనదేనా ? అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కిసాన్ పంచాయతీకు సుప్రీం చివాట్లు పెట్టింది. రహదారులను దిగ్భందించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ…ఢిల్లీ మెడను పిసుకుతున్నారంటూ..వ్యాఖ్యానించింది.
Read More : Air India : హిస్టరీ రిపీట్.. 68ఏళ్ల తర్వాత టాట్ గ్రూపు చేతికి ఎయిర్ ఇండియా!
నిరసన మార్గాన్ని కోరుకున్నప్పుడు కోర్టును ఆశ్రయించడం ఎందుకు ? అని సూటిగా ప్రశ్నించింది. జంతర్ మంత్ వద్ద ధర్నా కోరుతూ…కిసాన్ మహా పంచాయత్ పిటిషణ్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీం స్పందించింది. రహదారులపై బైఠాయించడంపై కిసాన్ మహా పంచాయత్ స్పందించింది. రైతుల ధర్నాలో భాగం కాదని కోర్టుకు తెలిపింది. జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహం తెలుపుతామని వెల్లడించింది. రైతుల ధర్నాలో భాగం కాదంటూ..రాతపూర్వకంగా..అఫిడవిట్ దాఖలు చేయాలంటూ..సూచించింది. తదుపరి విచారణనను సోమవారానికి వాయిదా వేసింది. కేంద్రం కొత్తగా తెచ్చిన మూడు చట్టాలను నిరసిస్తూ…రైతుల సంఘాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ రహదారుల దిగ్భందం చేస్తున్నారు రైతులు.