ఎన్నికల సంఘం తీరుపై సుప్రీం సీరియస్
ఎన్నికల సంఘం పనితీరు పట్ల సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది.

ఎన్నికల సంఘం పనితీరు పట్ల సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది.
ఢిల్లీ: ఎన్నికల సంఘం పనితీరు పట్ల సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా వారిపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం పట్ల దాఖలైన పిటీషన్ ను సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాద్, మాయావతి చేసిన కామెంట్లను ప్రస్తావించింది. “అసలు మీరేం చేస్తున్నారు ? మీ అధికారాలేంటో తెలుసా ?” అంటూ ప్రశ్నించింది.
Read Also : నోటికి తాళం : యోగీ, మాయావతి ప్రచారంపై ఈసీ నిషేధం
ఎన్నికల సంఘానికి అధికారాలు తక్కువగా ఉండటం పై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మీ నుంచి సరైన సమాధానం రాకపోతే చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ను పిలవాల్సి ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన యూపీ సీఎం ఆదిత్యనాధ్ పై ఎటువంటి చర్యలు తీసుకున్నారని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఈసీ తరుఫు న్యాయవాదిని ప్రశ్నించగా ఆ కేసు క్లోజ్ అయ్యిందని చెప్పారు. న్యాయవాది సమాధానంతో అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు రేపటి లోగా ఈసీ ప్రతినిధులు హాజరై సరైన వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
Read Also : గాల్లో ఉద్యోగాలు : 20 వేల మంది ఉద్యోగులను ఆదుకోండి