Surinder Pal : 135 రోజులుగా మొబైల్ టవర్ పై నిరసన..ప్రభుత్వ హామీతో కిందకి

135 రోజులుగా 200 అడుగుల ఎత్తున్న మొబైల్ ట‌వ‌ర్‌పై కూర్చొని నిర‌స‌న చేస్తున్న పంజాబ్ కి చెందిన సురీంద‌ర్ పాల్ సోమవారం తన ఆందోళనని విరమించాడు.

Surinder Pal : 135 రోజులుగా మొబైల్ టవర్ పై నిరసన..ప్రభుత్వ హామీతో కిందకి

Patiyala

Updated On : August 2, 2021 / 10:11 PM IST

Surinder Pal  135 రోజులుగా 200 అడుగుల ఎత్తున్న మొబైల్ ట‌వ‌ర్‌పై కూర్చొని నిర‌స‌న చేస్తున్న పంజాబ్ కి చెందిన సురీంద‌ర్ పాల్ సోమవారం తన ఆందోళనని విరమించాడు. ప్ర‌భ‌ుత్వం తమ డిమాండ్ల‌కు ఒప్పుకోవ‌డంతో 135 రోజుల తర్వాత నిరసన విరమించి మొబైట్ టవర్ నుంచి కిందకి దిగాడు. తాళ్ల సాయంతో సురక్షితంగా సురీంద‌ర్ పాల్ ని కిందకి దించినట్లు పటియాలా ఎస్పీ వీ శర్మ తెలిపారు.

కాగా,పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలాలో.. ఎలిమెంట‌రీ టీచ‌ర్ ట్రెయినింగ్ (ETT), టీచ‌ర్ ఎలిజిబులిటీ టెస్ట్ (TET) క్వాలిఫైడ్ టీచ‌ర్లు త‌మ డిమాండ్ల కోసం గ‌త కొన్ని నెల‌లుగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తున్నారు. ఆ నిర‌స‌న‌ల్లో భాగంగానే సురీంద‌ర్ పాల్ అనే టీచ‌ర్ 135 రోజులుగా మొబైల్ ట‌వ‌ర్‌ పై నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న కొనసాగించాడు. అయితే సోమ‌వారం ప్ర‌భ‌ుత్వం వారి డిమాండ్ల‌కు ఒప్పుకోవ‌డంతో కింద‌కు దిగాడు.