Taj Hotel Covid Cases : తాజ్ హోటల్‌లో 76మందికి కరోనా పాజిటివ్

ఉత్తరాఖండ్‌ రిషికేశ్‌లోని తాజ్‌ హోటల్‌లో కరోనా కలకలం రేపింది. 76మందికి కరోనా సోకింది. కరోనా కేసులు నమోదు కావడంతో మూడు రోజుల పాటు హోటల్‌ను మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

Taj Hotel Covid Cases : తాజ్ హోటల్‌లో 76మందికి కరోనా పాజిటివ్

Taj Hotel In Rishikesh Closed For Three Days After 76 People Found Covid 19 Positive (1)

Updated On : March 29, 2021 / 9:46 PM IST

76 people Covid-19 positive in Taj Hotel : ఉత్తరాఖండ్‌ రిషికేశ్‌లోని తాజ్‌ హోటల్‌లో కరోనా కలకలం రేపింది. 76మందికి కరోనా సోకింది. కరోనా కేసులు నమోదు కావడంతో మూడు రోజుల పాటు హోటల్‌ను మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. హోటల్‌ని శానిటైజ్‌ చేసిన అనంతరం ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హోటల్‌ను తాత్కాలికంగా మూసివేశారు.

కుంభమేళాకు హరిద్వార్‌ సన్నద్ధమవుతున్న వేళ కరోనా కేసులతో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ కుంభమేళాకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. కరోనా కేసుల పెరిగిపోతున్న కారణంగా సర్కార్‌ అప్రమత్తమైంది.

కఠిన ఆంక్షలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుంభమేళాకు తరలివచ్చే భక్తులకు కొవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరిగా ఉండాల్సిందిగా సూచించింది. లేదంటే వ్యాక్సినేషన్‌ ధ్రువీకరణ పత్రమైనా ఉండాలి. కుంభమేళా ఏప్రిల్‌ 1న ప్రారంభం కానుంది.