అంత బలుపా? గిరిజన బాలుడితో కాళ్లకున్న చెప్పులు తీయించి న మంత్రి..వైరల్ వీడియో

తమిళనాడు అటవీశాఖ మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ చేసిన పని విమర్శలకు దారి తీసింది. ఓగిరిజన బాలుడిని దగ్గరు పిలిచిన మంత్రి..ఒరేయ్..నాకాళ్లకు ఉన్న చెప్పులు తీయరా అని చెప్పాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రిగారూ ఇది మీకు తగునా అంటూ నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే..తమిళనాడు అటవీశాఖ మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ నీలగిరి జిల్లా పర్యటనకు వెళ్లారు. అక్కడ ముడుమలై టైగర్ రిజర్వ్ ప్రాంతంలోని దేవాలయాన్ని సందర్శించుకునేందుకు వెళ్లారు. దేవాలయం ఎదుట చెప్పు తీయటానికి అక్కడే ఉన్న గిరిజన బాలుడిని దగ్గరకు పిలిచి కాళ్లకున్న చెప్పుల బెల్ట్ ను తీయించుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది.
వీడియోను చూసిన నెటిజెన్లు మంత్రి అయితే మాత్రం ఇంత అహంకారమా? తన చెప్పులకున్న బెల్ట్ తీసుకోవటానికి కూడా ఒంగలేరా? అంత బలుపా అంటూ విమర్శిస్తున్నారు. ఆ సమయంలో మంత్రి పక్కనే పోలీసులు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు.
వారితో పాటు నీలగిరి జిల్లా కలెక్టర్ దివ్య కూడా ఉన్నారు. కానీ ఎవ్వరూ ఏమీ అనలేదు. కనీసం వీరెవరూ వారించే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే పదవిలో ఉన్న నాయకులంటే అందరికీ భయమే. తమ ఉద్యోగానికి ఎక్కడ ముప్పు వస్తుందోనని.
వీడియోలో కనిపించని మరో ఇద్దరి పిల్లలను మంత్రి ఇక్కడకి రండి అంటూ పిలిచారు. ఆ..తొందరగా రండిరా..అంటూ పిలిచారు మంత్రివర్యులు. ఇక ఒక అబ్బాయి దగ్గరకు రాగానే తన కాలు తీసి ముందుకు పెట్టి ఈ బకల్‌ను తీయి అంటూ కాలు ముందుకు చాపారు. అంతకుముందు పిల్లలు దగ్గరకు రాకపోవడంతో పార్టీ కార్యకర్తలు వారిని గదమాయించగా… తొందరేమీ లేదని మంత్రి చెబుతున్నట్లుగా వీడియోలో ఉంది.
#WATCH Tamil Nadu minister Dindigul C Srinivasan makes a boy remove his sandals during the Minister’s visit to Mudumalai National Park. pic.twitter.com/L4dZr8Q33y
— ANI (@ANI) February 6, 2020
మంత్రిపై మండిపడుతున్న సామాజిక కార్యకర్తలు, నెటిజెన్లు దీనిపై అటవీశాఖ హక్కుల నేతలు తీవ్రంగా స్పందించారు.
కాగా..మంత్రి శ్రీనివాసన్ గతంలో కూడా పలుమార్లు నోరుజారి విమర్శలపాలయ్యారు.ఓ గిరిజన బాలుడితో చెప్పులు తీయించుకోవడం క్షమించరాని నేరమని సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు.