Tamil Nadu : మధురైలో నిఫా ప్రత్యేక వార్డు ఏర్పాటు

కేరళలో నిఫా వైరస్ కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. మదురైలోని ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రిలో నిఫా వైరస్ బాధితుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు.

Tamil Nadu : మధురైలో నిఫా ప్రత్యేక వార్డు ఏర్పాటు

Special Nipah Ward In Madurai Hospital

Updated On : September 10, 2021 / 7:20 PM IST

Special Nipah Ward In Madurai Hospital : కేరళలో నిఫా వైరస్ కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు కర్ణాటక సరిహద్దు జిల్లాలు, రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణీకుల మధ్య నిఘాను పటిష్టం చేశాయి. మదురైలోని ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రిలో నిఫా వైరస్ బాధితుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రాజాజీ హాస్పిటల్‌లో ఇప్పటివరకూ ఒక్క నిఫా వైరస్ కేసు లేదని మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నటరాజన్ ధృవీకరించారు. ఇప్పటి వరకు నిపా వైరస్ కేసు రాలేదని అన్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా అన్ని పడకలలో వెంటిలేటర్, ఆక్సిజన్ సపోర్టు వంటి సౌకర్యాలతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
Red Ant Chutney : కరోనాకు నివారణగా ఎర్రచీమల చట్నీ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో నిఫా భయాల మధ్య, కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ డాక్టర్ జిఎస్ సమీరన్ డిపాజిట్‌లో నమోదైన నిఫా వైరస్ కేసు తప్పుడు సమాచారాన్ని కొట్టిపారేశారు. అదంతా తప్పుడు సమాచారమని అన్నారు. కేరళలోని కాలికట్‌లో ఒక నిఫా కేసు నమోదైందని చెప్పారు. అయితే కోయంబత్తూర్‌లో సరిహద్దులో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సమీరన్ వెల్లడించారు.

కేరళ నుంచి తమిళనాడులోకి ప్రవేశించే ప్రయాణీకులు 13 చెక్ పాయింట్‌లను దాటాల్సి ఉంటుంది. RT-PCR నెగటివ్ రిపోర్టు తప్పనిసరిగా చూపించాలి. కఠినమైన నిబంధనలను పాటించాలని కేంద్రం ప్రజలకు సూచించింది. అలాగే వైరస్ కాంటాక్టులను తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. నిఫా వైరస్ ఫ్రూట్ గబ్బిలాల నుంచి సంకమ్రిస్తుంది. మానవులకు, జంతువులకు ప్రాణాంతకంగా మారింది. ఈ ప్రాణాంతక వ్యాధి సోకినవారిలో జ్వరం, కండరాల నొప్పి, తలనొప్పి, మైకము, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Chicken Blood Parenting : చైనాలో మొదలైన కొత్త ట్రెండ్.. అది నాశనానికే అంటున్న నిపుణులు..!