మరో దారుణం…11ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్

మహిళలపై దారుణాలు ఆగడం లేదు. మానవరూపంలో ఉన్న కొన్ని మృగాలు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో ఇటీవల వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి దారుణ ఘటన మరువకముందే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గడిచిన 48 గంటల్లో మహిళలపై జరుగుతున్న దాడులు ఈ దేశంలో ఇవే చట్టాలు కొనసాగితే మహిళలకు ఇక ఎంతమాత్రం రక్షణ ఉండదు అన్పిస్తోంది. ఏదో ఒక చోట నుండి మనిషి రూపంలో ఉన్న కామాంధులు,మృగాలు కొందరు అణ్యం పుణ్యం తెలియని,నెలలు నిండని పసిపాపలను కూడా వదలకుండా తమ కామ వాంఛ తీర్చుకుంటున్నారు. అసలు ఇలాంటి వాళ్లను కఠినంగా,త్వరగా శిక్షించే చట్టాలు భారత్ లో లేకపోవడం చాలా దారుణం. దీనికి ఉదాహరణే నిర్భయ దోషులకు ఇప్పటికి కూడా మరణశిక్ష అమలుకాకపోవడం.
తమిళనాడులోని కోయంబత్తూరులో 11ఏళ్ల బాలికపై ఆరుగురు యువకులు సామూహిక హత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గత మంగళవారం తన ఫ్రెండ్ తో కలిసి బర్త్ డే పార్టీ సెలబ్రేట్ చేసుకునేందుకు బయటికి వెళ్లిన బాలిక ఇంటికి తిరిగివస్తున్నప్పుడు రాత్రి 9గంటల సమయంలో ఓ గ్యాంగ్ వారిని అడ్డుకుంది. బాలిక ఫ్రెండ్ ను తీవ్రంగా కొట్టిన ఆ గ్యాంగ్ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి లాక్కొని వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా దాన్నంతా వీడియో తీశారు. ఆ తర్వాతి రోజు బాలిక ఈ ఘటన గురించి తన తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.