Ambulance Accident: డెలివరీకి వెళుతుండగా..గర్భిణీతో పాటు కడుపులో బిడ్డ మృతి

Ambulance Accident In Tamil Nadu
Ambulance accident in tamil nadu : తమిళనాడులోని కల్లాకురుచ్చిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓగర్భిణి ప్రసవం కోసం వెళుతుండగా ఆమె ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురి కావటంతో దారిలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో గర్భిణితో కడుపులోని బిడ్డ కూడా చనిపోయింది. దీంతో ఆ పసిగుడ్డు ఈలోకాన్ని చూడకుండానే అమ్మ కడుపులోనే అమ్మతోనే సహా ప్రాణాలు కోల్పోయింది.
కల్లకురిచి జిల్లా శంకరపురంలో అంబులెన్స్ అదుపు తప్పి చెట్టును ఢీ కొనడంతో ముగ్గురు చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. డెలివరీ కోసం గర్భిణిని బంధువులు అంబులెన్స్ లో తీసుకెళ్తుండగా పుదిపట్టు వద్ద అలథూర్ సరస్సు సమీపంలో అంబులెన్స్ టైర్ పేలిపోయింది. దీంతో అంబులెన్స్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఓ చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గర్భిణితో సహా ఆమె కడుపులోని బిడ్డ మరో ఇద్దరు బంధువులు ప్రాణాలు కోల్పోయారు.ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ తో పాటు మహిళా అసిస్టెంట్ గాయపడ్డారు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన అంబులెన్స్ డ్రైరవ్ ను..మహిళా అసిస్టెంట్ ను సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. చనిపోయిన ముగ్గురి డెడ్ బాడీలను పోస్ట్ మార్టం కోసం కల్లకురిచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.