స్టూడెంట్స్ కు టీచర్ వార్నింగ్ : అవెంజర్స్ ను స్పాయిల్ చేయొద్దు

ప్రపంచ వ్యాప్తంగా అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ ఏప్రిల్ 26న విడుదల అయింది. ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లోనూ ఈ మూవీ రిలీజ్ కావడంతో మార్వెల్ అభిమానులంతా టికెట్ల కోసం ఎగపడుతున్నారు.

  • Published By: sreehari ,Published On : April 27, 2019 / 10:30 AM IST
స్టూడెంట్స్ కు టీచర్ వార్నింగ్ : అవెంజర్స్ ను స్పాయిల్ చేయొద్దు

Updated On : April 27, 2019 / 10:30 AM IST

ప్రపంచ వ్యాప్తంగా అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ ఏప్రిల్ 26న విడుదల అయింది. ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లోనూ ఈ మూవీ రిలీజ్ కావడంతో మార్వెల్ అభిమానులంతా టికెట్ల కోసం ఎగపడుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ ఏప్రిల్ 26న విడుదల అయింది. ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లోనూ ఈ మూవీ రిలీజ్ కావడంతో మార్వెల్ అభిమానులంతా టికెట్ల కోసం ఎగపడుతున్నారు. ఇప్పటికే అవెంజర్స్ మూవీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ కోసం ఎదురుచూస్తున్న మార్వెల్ ఫ్యాన్స్ కు సినిమా చూసే అవకాశం దొరికితే వదిలిపెడతారా? అసలే వదిలిపెట్టరు. మూవీ రిలీజ్ కు రెండు రోజుల ముందే అవెంజర్స్ ఫుల్ మూవీ ఆన్ లైన్ లో లీక్ కావడంతో సదరు మార్వెల్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు.

థియేటర్లలో చూసి థ్రిల్ అవ్వాల్సిన మూవీని ముందుగానే చూసినా.. ఎక్కడైనా ఆ మూవీ గురించి చర్చించినా ఊరుకోవడం లేదు. అవెంజర్స్ ను స్పాయిల్ చేయొద్దంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అవెంజర్స్ ను స్పాయిల్ చేస్తారనే భయంతో.. సూపర్ హీరోస్, మూవీ క్రియేటర్లు సైతం డోంట్ స్పాయిల్ ది ఎండ్ గేమ్ అంటూ హ్యాష్ ట్యాగుతో స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. అవెంజర్స్ మూవీపై.. ఓ టీచర్.. తమ స్టూడెంట్స్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన ఫన్నీ నోటీసు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ట్విట్టర్ యూజర్ కమిల్లియస్ అనే స్టూడెంట్.. ఈ పోస్టు పెట్టింది. తమ టీచర్ అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీకి క్లాసు బయట డైహార్డ్ ఫ్యాన్. ఈ సినిమా చూడాలని ఆయన ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. తాను సినిమా చూడకముందే క్లాసు రూంలోని విద్యార్థులు ఎవరూ అవెంజర్స్ మూవీ గురించి చర్చించుకోవద్దని రూల్ పెట్టారంటూ పోస్టు పెట్టింది. టీచర్ వార్నింగ్ నోటీసులో ఏముందంటే..   ‘నా సోదరుడు టంపాలో ఓ బిజినెస్ ట్రిపులో ఉన్నాడు. అతడు వచ్చాక ఇద్దరం కలిసి అవెంజర్స్ మూవీకి వెళ్లాలి. మూవీ చూసే వరకు క్లాసులో ఎవరూ చర్చించుకోకూడదు.

ఈ నోటీసు తొలగించే వరకు అవెంజర్స్ మూవీలో ఏ ఒక్క ఫ్రేమ్ కూడా రివీల్ చేయొద్దు. మార్వెల్ కామిక్స్ కు నేను ఎంత బిగ్ ఫ్యానో మీకు తెలిసే ఉంటుంది. నేను చూడక ముందే మూవీలోని ఏ ఒక్క సింగిల్ ఫ్రేమ్ నాకు ముందే చెప్పద్దు.. మిమ్మిల్ని మాయం చేయొద్దని థానోస్ ను కోరుతానని హమీ ఇస్తున్నా’ అంటూ ఫన్నీగా నోటీసు పెట్టాడు. ఈ నోటీసును ట్విట్టర్ లో పోస్టు చేసిన క్షణాల్లోనే 63వేల 793 రీట్వీట్లు, 250,313 లైకులు వచ్చాయి.