Tamili Sai : పాండిచ్చేరి-హైదరాబాద్ ఫస్ట్ డైరెక్ట్ ఫ్లైట్ లో ప్రయాణించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్
హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి విమాన సర్వీసులను పునరుద్ధరించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు.

Tamilisai
Telangana Governor Tamili Sai : పాండిచ్చేరి-హైదరాబాద్ మధ్య ప్రవేశపెట్టిన మొదటి డైరెక్ట్ విమానంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై ప్రయాణించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో గవర్నర్ తీసుకున్న చొరవతో పాండిచ్చేరి-హైదరాబాద్ మధ్య డైరెక్ట్ ఫ్లైట్ ప్రవేశపెట్టారు. గవర్నర్ తమిళి సై శంషాబాద్ విమానాశ్రయంలోని జనరల్ అరైవల్ పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు పుదుచ్చేరిలోని అందమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడతారని అన్నారు.
పుదుచ్చేరి ప్రజలు హైదరాబాద్ బిర్యానీని రుచి చూడటానికి ఇష్టపడతారని తెలిపారు. రోజువారీ విమాన ప్రయాణం ఈ రెండు ప్రాంతాల ప్రజల బంధాన్ని మెరుగుపరుస్తుందని గవర్నర్ విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి విమాన సర్వీసులను పునరుద్ధరించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు.
Governor Tamilisai : గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
పుదుచ్చేరికి విమాన కనెక్టివిటీని పెంచేందుకు హామీ ఇచ్చినందుకు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు. పుదుచ్చేరి విమానాశ్రయంలో రన్‌వే విస్తరణ కోసం తమిళనాడు నుంచి భూమిని సేకరించేందుకు చర్యలు తీసుకుంటామని గవర్నర్ తెలిపారు.