Asaduddin Owaisi: ఇండియా మోదీ, అమిత్‌షాది కాదు.. అసలు ఇండియా వారిది..
ఇండియా.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాది కాదు. మొఘలులు ఇక్కడికి వచ్చిన తర్వాతే బీజేపీ, ఆర్ఎస్ఎస్ పుట్టుకొచ్చాయంటూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Oyc
Asaduddin Owaisi: ఇండియా.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాది కాదు. మొఘలులు ఇక్కడికి వచ్చిన తర్వాతే బీజేపీ, ఆర్ఎస్ఎస్ పుట్టుకొచ్చాయంటూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మహారాష్ట్ర లో భీవండిలో జరిగిన బహిరంగ సభలో అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత దేశం నాది కాదు, మోదీ, అమిత్ షాలది అంతకంటే కాదు, ఠాక్రేలది కాదు.. అసలు భారత దేశం ద్రవిడియన్లు, ఆదివాసీలది మాత్రమే అని అన్నారు. భారత దేశానికి మొఘలులు వచ్చిన తర్వాతే బీజేపీ – ఆర్ఎస్ఎస్ వాళ్లు పుట్టుకొచ్చారని అసదుద్దీన్ అన్నారు. ఆఫ్రికా, మధ్య ఆసియా, ఇరాన్, తూర్పు ఆసియా నుంచి వలస వచ్చిన వారితో భారత్ ఏర్పడిందని అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
https://twitter.com/aimim_national/status/1530571169950502912?cxt=HHwWgMDUhdWX170qAAAA
అసదుద్దీన్ ఓవైసీ తాజ్‌మహల్ వ్యవహారంపైనా స్పందించారు. తాజ్ మహల్ నిజానికి ఒక శివాలయమని, అందులో ముస్లిం ఉన్న 22 గదుల్లో ఏముందో వెలికి తీయాలని బీజేపీకి చెందిన ఓ నాయకుడు కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. అయితే అలహాబాద్ హైకోర్టు ఆ పిటీషన్‌ను తోసిపుచ్చింది. ఈ సందర్భంగా అసుద్దీన్ మాట్లాడుతూ.. అక్కడ మోదీ డిగ్రీ పట్టా ఏమైనా దొరుకుతుందేమోనని వాళ్లు వెతుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పై కూడా ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు చేసినట్లుగా నవాబ్ మాలిక్ అరెస్ట్ పై ప్రధాని మోదీని ఎందుకు కలవలేదని ప్రశ్నించారు.
Asaduddin Owaisi: ఆమ్ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌పై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..
ఆయన ముస్లిం వ్యక్తి కావటం వల్లనే శరత్ పవార్ అలా వ్యవహరించారా అంటూ ప్రశ్నించారు. సంజయ్ రౌత్, నవాబ్ మాలిక్ కన్నా ఎక్కువా? నవాబ్ మాలిక్ కు ఎందుకు సహాయం చేయలేదని ఎన్సీపీ కార్యకర్తలు శరద్ పవార్‌ను నిలదీయాలంటూ ఓవైసీ డిమాండ్ చేశారు. కేంద్రం ద్రవ్యోల్బనం, నిరుద్యోగితపై మాట్లాకుండా ముస్లింలను బూచిగా చూపిస్తున్నదని, మోదీ, అమిత్ షా, శరద్ పవార్ కు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారని అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు.