Central Government : కోవిడ్ బాధితుల కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల
కోవిడ్ బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కోవిడ్ బాధితుల కోసం గత జులైలో విడుదల చేసిన మార్గదర్శకాల్లో కేంద్రం పలు మార్పులు చేసింది.

The Central Government Released New Guidelines For Covid Victims
new guidelines for covid victims : కోవిడ్ బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కోవిడ్ బాధితుల కోసం గత జులైలో విడుదల చేసిన మార్గదర్శకాల్లో కేంద్రం పలు మార్పులు చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
స్వల్ప లక్షణాలున్నా, లక్షణాలున్నా ఇంటికే పరిమితం కావాలని సూచించింది. బీపీ, షుగర్ ఉన్నవారు తప్పకుండా వైద్యుల సలహా పాటించాలని తెలిపింది. కరోనా బాధితులు మూడు పొరల మాస్క్ ధరించాలని సూచించింది. వీలైనంత ఎక్కువగా నీరు, ద్రవ ఆహారం తీసుకోవాలని పేర్కొంది.
కరోనా బాధితులు ఆక్సిజన్ స్థాయిలను ఎప్పిటికప్పుడు పరిశీలించుకోవాలని తెలిపింది. ఐసోలేషన్ నుంచి పది రోజుల తర్వాత బయటికి రావొచ్చన్నారు. చివరి మూడు రోజుల్లో జ్వరం రాకపోతే కరోనా పరీక్ష అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.