Madhya Pradesh : దళితుడిని పెళ్లి చేసుకుందని కూతురికి గుండు గీయించి పుణ్యస్నానం చేయించిన తండ్రి

మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. దళిత యువకుడిని పెళ్లి చేసుకుందని కూతురుకు గుండు గీయించి పుణ్యస్నానం చేయించాడో తండ్రి. పైగా అతనికి విడాకులివ్వాలని ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు.

Madhya Pradesh : దళితుడిని పెళ్లి చేసుకుందని కూతురికి గుండు గీయించి పుణ్యస్నానం చేయించిన తండ్రి

Madhya Pradesh (1)

Updated On : October 31, 2021 / 2:20 PM IST

father shaved his daughter : మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. దళిత యువకుడిని పెళ్లి చేసుకుందని కూతురుకు గుండు గీయించి పుణ్యస్నానం చేయించాడో తండ్రి. పైగా అతనికి విడాకులివ్వాలని ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈ ఘటన బేతుల్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బేతుల్‌లోని చోప్నాకు చెందిన సాక్షీ యాదవ్ హాస్టల్‌ ఉంటూ నర్సింగ్‌ కోర్సు చదువుతోంది.

గతేడాది మార్చి 11న అమిత్‌ అహిర్వార్‌ అనే దళిత యువకుడిని ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకుంది. అయితే తాను పెళ్లి చేసుకున్నట్లు ఈ ఏడాది జనవరి 4న తన తండ్రికి చెప్పింది. దీంతో అతడు జనవరి 10న తన కూతురు తప్పిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెను తన కుటుంబసభ్యులకు అప్పగించారు. నర్సింగ్‌ పూర్తి చేయడానికి ఫిబ్రవరిలో మళ్లీ హాస్టల్‌కు వెళ్లింది.

Corona Cases : దేశంలో కొత్తగా 12,830 కరోనా కేసులు, 446 మరణాలు

గత ఏడాది ఆగస్టు 18న రాఖీపౌర్ణమి పేరుతో తండ్రి.. ఆమెను హాస్టల్‌ నుంచి ఇంటికి తీసుకెళ్లాడు. తర్వాత ఆమెను హోషంగాబాద్‌లోని నర్మదా నది వద్దకు తీసుకువెళ్లి.. ఆమెకు గుండు చేయించాడు. దళితుడిని పెళ్లి చేసుకున్నందుకు బలవంతంగా ఆమెతో పుణ్యస్నానం చేయించాడు. భర్తకు విడాకులు ఇవ్వాలని కుటుంబ సభ్యులు ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చారు.

వేధింపులు ఎక్కువవడంతో వారి నుంచి తప్పించుకున్న సాక్షి.. తన భర్త దగ్గరకు వెళ్లింది. జరిగిన విషయం చెప్పడంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.