IIT Reservations : ఐఐటీల్లో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఐఐటీల్లో రిజర్వేషన్ల కల్పన విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఐఐటీల్లో పరిశోధన సీట్ల ప్రేవేశాలు, అధ్యాపక నియమాకల్లో రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయాలని తీర్పు ఇచ్చింది.

Supreme Court
IIT Reservations : ఐఐటీల్లో రిజర్వేషన్ల కల్పన విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఐఐటీల్లో పరిశోధన సీట్ల ప్రేవేశాలు, అధ్యాపక నియమాకల్లో రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయాలని తీర్పు ఇచ్చింది. ఐఐటీ నియామకాల్లో రిజర్వేష్లన్లు పాటించేలా ఆదేశించాలని ఎస్ఎన్ పాండే అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
ఐఐటీల్లో నియామకాలకు సంబంధించి పారదర్శకత పాటించడం లేదని పిటిషనర్ తెలిపారు. అనర్హులను నియమిస్తున్నారని ఆరోపించారు. నిబంధనలను అతిక్రమించి నియామకాలు చేపడుతున్నట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ పిటిషన్ పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్ తో కూడిన ధర్మసనం విచారణ జరిపింది. ఐఐటీల్లో కచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేయాలని తేల్చి చెప్పింది.