Supreme Court Collegium Meeting : జడ్డీల నియామకాలపై కొలీజియం సమావేశం.. వివరాలను వెల్లడించలేమన్న సుప్రీంకోర్టు

కొలీజియం సమావేశం వివరాలను వెల్లడించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జడ్డీల నియామకాలపై కొలీజియం సమావేశాల్లో చర్చల వివరాలు వెల్లడించాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆర్టీఐ చట్టం కింద ఆ వివరాలను బయటపెట్టలేమని తేల్చి చెప్పింది.

Supreme Court Collegium Meeting : జడ్డీల నియామకాలపై కొలీజియం సమావేశం.. వివరాలను వెల్లడించలేమన్న సుప్రీంకోర్టు

Supreme Court

Updated On : December 10, 2022 / 9:33 AM IST

Supreme Court Collegium Meeting : కొలీజియం సమావేశం వివరాలను వెల్లడించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జడ్డీల నియామకాలపై కొలీజియం సమావేశాల్లో చర్చల వివరాలు వెల్లడించాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆర్టీఐ చట్టం కింద ఆ వివరాలను బయటపెట్టలేమని తేల్చి చెప్పింది. ఇద్దరు జడ్జీల నియామకం కోసం 2018 డిసెంబర్ 12వ తేదీన జరిగిన కొలీజియం సమావేశం వివరాలను తెలపాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలు అయింది. దీనిపై శుక్రవారం(డిసెంబర్ 9,2022) జస్టిస్ ఎంఆర్ షా, సీటీ రివికుమార్ తో కూడిన ధర్మాషనం విచారణ చేపట్టింది.

ఈ మేరకు జడ్జీలు మాట్లాడుతూ కొలీజియం అనేది బహుళ సభ్యుల సమాహారమన్నారు. ఆ రోజు సమావేశంలో ఏం చర్చించుకున్నా వాటిని బహిర్గతం చేయలేమని స్పష్టం చేశారు. ఇప్పుడు తీసుకున్నది తాత్కాలిక నిర్ణయమని, దీన్ని ప్రజల ముందు ఉంచలేమని చెప్పారు. సమావేశం తుది నిర్ణయాన్ని మాత్రమే వెల్లడిస్తామన్నారు. కొలీజియం సభ్యుల్లో ఒకరు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా పిటిషనర్ పిటిషన్ దాఖలు చేశారని పేర్కొన్నారు.

Supreme Court: జడ్జీల నియామకంలో కొలీజియంను సమర్ధించిన సుప్రీం.. కేంద్ర ప్రభుత్వానికి సూటి సమాధానం

మీడియా రిపోర్టులపై కోర్టు స్పందించదని స్పష్టం చేశారు. ఈ అంశంలో మరోసారి స్పందించదల్చుకోలేదన్నారు. కొలీజియం సమావేశంలో రిటైర్డ్ సీఐజే రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎన్ఏ బోబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సమావేశ వివరాలను సుప్రీంకోర్టు వైబ్ సైట్ లో అప్ లోడ్ చేయకపోవడం గమనార్హం.