Hanging Early Morning : ఉరిశిక్ష ఉదయాన్నే ఎందుకు అమలు చేస్తారో తెలుసా?

ఇప్పటివరకు అమలైన ఉరిశిక్షల గురించి విన్నాం. అయితే వీటిని ఉదయాన్నే ఎందుకు అమలు చేస్తారు? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. అసలు కారణాలు ఏంటి?

Hanging Early Morning : ఉరిశిక్ష ఉదయాన్నే ఎందుకు అమలు చేస్తారో తెలుసా?

Hanging Early Morning

Updated On : July 6, 2023 / 3:14 PM IST

Hanging Early Morning : ఇండియాలో క్రిమినల్ చట్ట ప్రకారం నేరస్థుడికి మరణశిక్ష విధించినపుడు ఉరి తీస్తారు. అత్యంత దారుణమైన నేరానికి పాల్పడితే ఈ శిక్ష విధించబడుతుంది. అయితే ఉరిశిక్ష విధించిన ప్రతిసారి తెల్లవారు ఝామున అమలు చేస్తారు. ఆ సమయంలోనే ఎందుకు ఉరి తీస్తారు? అనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే ఇలా అమలు చేయడం వెనుక చట్టపరంగా, పరిపాలన పరంగా, సామాజికంగా అనేక కారణాలు ఉన్నాయి.

Saudi Arabia : రంజాన్ మాసంలో ఉరిశిక్ష అమలు చేసిన సౌదీ అరేబియాపై విమర్శలు .. ఒక్క ఏడాదిలోనే 17 మరణశిక్షలు అమలు

ఉరిశిక్ష అనేది జైలు లోపల జైలు మాన్యువల్ ప్రకారం జరుగుతుంది. జైళ్ల పర్యవేక్షణ, నిర్వహణ కోసం జైలు మాన్యువల్ ఉంటుంది. అందులో తెల్లవారక ముందే ఉరిశిక్ష అమలు చేయాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా జైలు అధికారులు ఉరిశిక్షను అమలు చేస్తారు.

 

ఉరిశిక్ష అమలు చేయడం అంటే అధికారులకు సవాల్‌తో కూడుకున్న పని. రోజువారి కార్యక్రమాలకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా నేరస్థుడికి ఉదయాన్నే శిక్ష అమలు చేస్తారు. ఈ సమయంలో నేరస్థుడికి వైద్య పరీక్షలు, కొన్ని పత్రాలు పూర్తి చేయడం, కొన్ని పత్రాలు ఆమోదించడం, నేరస్థుడి మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించడం వంటి పనులు ఉంటాయి. ఉదయాన్నే ఇవి పూర్తి చేయడానికి అధికారులకు వెసులుబాటు ఉంటుంది.

Iran: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేసినందుకు ముగ్గురిని ఉరి తీసిన ఇరాన్

ఉరి తీయబడుతున్న నేరస్థుడు తీవ్రమైన ఒత్తిడి, వేదనలో ఉంటాడు. నేరస్థుడిని మానసిక హింసకు గురి చేయడం చట్టం ఉద్దేశ్యం కాదు.. అతనికి విధించింది మరణశిక్ష. అందుకని నేరస్థుడు ఒత్తిడికి గురవ్వకుండా ఉదయాన్నే మరణశిక్ష అమలు చేస్తారు. ఇక నేరస్థుడి మృతదేహాన్ని కుటుంబసభ్యులు తీసుకెళ్లి  అంత్యక్రియలు నిర్వహించడానికి సమయం ఉంటుంది కాబట్టి తెల్లవారు ఝామున ఉరి శిక్ష అమలు చేస్తారట.

 

మరణశిక్ష అనేది సంచలన వార్త. దీని ప్రభావం ఒక్కోసారి సామాజిక వాతావరణంపై ప్రభావం చూపిస్తుంది. ఉరి తీయబడే వ్యక్తి గురించి వార్తలు ప్రసారం చేయడానికి మీడియా కాచుకుని ఉంటుంది. కొన్ని సున్నితమైన సందర్భాల్లో ప్రజలు ఆగ్రహావేశాలకు లోనవుతారు. ఇలాంటి పరిస్థితులను నివారించడానికి కూడా ప్రజలు నిద్ర లేచే లోపు ఉరిశిక్ష అమలు చేస్తారు.