Hot Summer : ఈ సమ్మర్‌లో మాడు పగలడం ఖాయం..! ఈసారి సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు, ఏపీ తెలంగాణలో మంటలే

గతంలో ఎప్పుడూ లేనంతగా ఎండలు ఉండబోతున్నట్లు వార్నింగ్ ఇచ్చింది. రోళ్లు పగిలే ఎండలు కొట్టడం ఖాయమని పరిస్థితులు చూస్తే కూడా అర్థమవుతోంది.

Hot Summer : ఈ సమ్మర్‌లో మాడు పగలడం ఖాయం..! ఈసారి సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు, ఏపీ తెలంగాణలో మంటలే

This Summer Very Hot

Hot Summer : ఈ సమ్మర్ చాలా హాట్ గురూ అంటోంది ఐఎండీ. సూరీడు సుర్రుమంటాడు. మాడు పగిలిపోవడం ఖాయం. భానుడి భగభగలకు చిర్రెత్తిపోతోంది. కాసుకోండి అంటూ అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. గతంలో ఎప్పుడూ లేనంతగా ఎండలు ఉండబోతున్నట్లు వార్నింగ్ ఇచ్చింది. రోళ్లు పగిలే ఎండలు కొట్టడం ఖాయమని పరిస్థితులు చూస్తే కూడా అర్థమవుతోంది.

ఈసారి సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు..
సూపర్ సోనిక్ రేంజ్ లో సూర్యప్రతాపం, భరించలేనంత స్థాయిలో ఎండ, ఊపిరి ఆడనంత పరిస్థితిలో ఉక్కపోతలు.. ఓవరాల్ గా ఈ వేసవిలో ఎండలు మండిపోనున్నాయి. భానుడి భగభగ పబ్లిక్ ను పరేషాన్ చేయనుంది. పగటి పూట ఉష్ణోగ్రతలు గతంలో కంటే ఎక్కువగా ఉండబోతున్నాయి. రోళ్లు పగిలే ఎండలు ఉండబోతున్నాయి. ఇప్పటికే 37 డిగ్రీల ఎండ కొడుతోంది. అది కాస్తా 42 డిగ్రీలు దాటనుంది. ఇప్పుడు పగటిపూట అంతో ఇంతో బయటకు వెళ్లగలుగుతున్నాం. మరో 20 రోజులు అయితే ఇక బయటకు వెళ్లడమే కష్టం. ఈ సమ్మర్ లో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందే లేదంటే ప్రాణాలను రిస్క్ లో పడేయటం ఖాయం అంటున్నారు అధికారులు.

ఎల్ నినో ప్రభావంతో ఈ వేసవిలో హై టెంపరేచర్స్..
వాతావరణం మారుతోంది. సీజన్ తో సంబంధమే లేకుండా ఎండలు దంచికొడుతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే ఎండల ప్రభావం మొదలైంది. ఇప్పుడు మార్చి ఫస్ట్ వీక్ లోనే భానుడి భగభగ పీక్ కు చేరుకుంటోంది. రాబోయే రోజుల్లో ఇంకా కష్టం అంటోంది ఐఎండీ. రాబోయే రోజుల్లో భానుడి భగభగలతో ఉక్కపోత పెరిగి జనానికి పట్టపగలే చుక్కలు కనిపించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈసారి సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎల్ నినో ప్రభావంతో ఈ వేసవిలో టెంపరేచర్స్ అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది.

మార్చి 15 తర్వాత భానుడి భగభగ..
సాధారణంగా ఎప్పుడైనా మార్చి నుంచి ఎండలు క్రమక్రమంగా పెరిగి ఏప్రిల్, మే నెలలో పీక్స్ కి చేరతాయి. గతేడాది మేలో కురిసిన వర్షాలతో ఆ సమయంలో వాతావరణం ఒక్కసారిగా కూల్ గా మారింది. అయితే ఈసారి అలా జరిగే పరిస్థితి లేదంటోంది ఐఎండీ. ఎండల తీవ్రత అంతకంతకూ పెరిగే అవకాశం ఉందని, ఇది ప్రజలను తీవ్ర ఇబ్బందిపరిచే అంశం అని చెబుతోంది.

మార్చి మే నెల మధ్యలో గరిష్ట ఉష్ణోగ్రతలు..
ప్రతి ఏటా మార్చి తొలి వారంలో వేసవి కాలానికి సంబంధించి అలర్ట్ ఇస్తుంది ఐఎండీ. ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యంతో రాబోయే రోజుల్లో సాధారణ స్థాయి నుంచి అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ఛాన్స్ ఉంది. రాత్రి వేళల్లో ఉక్కపోత విపరీతంగా ఉండే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఈ నెల 15 వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

మార్చి 15వ తేదీ తర్వాత భానుడి అసలు స్వరూపం బయటపడనుంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి ప్రజలను ఇబ్బంది పెట్టనుంది. మార్చి, మే మధ్యలో దేశంలో చాలా చోట్ల సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని అంటున్నారు. ఉత్తర, మధ్య భారత్ లో మాత్రం మార్చిలో వడగాలుల తీవ్ర లేకపోవచ్చని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం వేసవి వరకు ఉండే అవకాశం ఉందని, ఆ తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని తెలిపింది వాతావరణ శాఖ.

తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వడగాలుల తీవ్రత..
ఇక ఈ వేసవిలో తెలుగు రాష్ట్రాల్లో కూడా వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వచ్చే 2 నెలలు ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లొదని హెచ్చరిస్తోంది ఐఎండీ. తెలంగాణ, ఏపీతో పాటు ఉత్తర కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వేడిగాలులు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. అనుకూల వర్షపాతానికి కారణమైన పరిస్థితులు మాత్రం వర్షా కాలం మధ్య నుంచి ఏర్పడనున్నట్లు అంచనాలు ఉన్నాయి. ఎండలు, వడగాలుల తీవ్రతపై వార్నింగ్ ఇచ్చిన ఐఎండీ.. ఓ గుడ్ న్యూస్ కూడా చెప్పింది. మార్చి నెలలో మాత్రం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.

పూర్తి వివరాలు..