Short Circuit : విషాదం.. కరెంట్ షాక్‌తో తల్లీ, కూతురు, మనవరాలు మృతి
కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. మిద్దెపై బట్టలు ఆరేయడానికి వెళ్లిన ఇంద్ర ఆమె మనుమరాలు కరెంట్ షాక్ గురై మృతి చెందారు. వీరిని కాపాడేందుకు వెళ్లిన ఇంద్ర కూతురు మహాలక్ష్మి కూడా కరెంట్ షాక్ తో మరణించారు

Short Circuit
Short Circuit :కరెంట్ షాక్‌తో తల్లీ కూతురు, మనవరాలు మృతి చెందిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే సింగారపేట పోలీసుస్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కు చెందిన పిచ్చుమని, ఇంద్ర (52) భార్యాభర్తలు వీరి కూతురు మహాలక్ష్మి. మహాలక్ష్మికి నాలుగేళ్ళ క్రితం మిట్టపల్లికి చెందిన శివతో వివాహం జరిగింది.. వీరికి మూడేళ్ళ కూతురు ఉంది. ఇటీవల మహాలక్ష్మి పుట్టింటికి వచ్చింది.
ఆదివారం సాయంత్రం ఇంద్ర మనవరాలిని ఎత్తుకుని మిద్దెమీదకు వెళ్ళింది. ఈ సమయంలోనే మిద్దెపై బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో ఆమె కేకలు విసింది. తల్లి కేకలు విన్న మహాలక్ష్మి మిద్దె ఎక్కి వారిని కాపాడే ప్రయత్నం చేసింది. ముగ్గురికి కరెంట్ షాక్ తగలడంతో వారు అక్కడిక్కడే మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకి పంపారు.
ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందటంతో స్థానికంగా విషాదం నెలకొంది. గతంలో అనేక సార్లు విద్యుత్ వైర్లు తొలగించాలని విద్యుత్ అధికారులను కోరినా వారు పట్టించుకోలేదని, అధికారుల నిర్లక్ష్యానికి ముగ్గురు ప్రాణాలు పోయాయని స్థానికులు, బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.