Corona Update : రోజువారీ కరోనా కేసుల రిపోర్టు విడుదల

శనివారం 10వేల కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో 10,302 కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.

Corona Update : రోజువారీ కరోనా కేసుల రిపోర్టు విడుదల

Corona Cases (2)

Updated On : November 20, 2021 / 11:33 AM IST

Corona Update :  శనివారం కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. శుక్రవారం 11వేల కేసులు నమోదు కాగా.. శనివారం 10వేల కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో 10,302 కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో 267 మంది మృతి చెందినట్లు తెలిపారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో 3,44,99,925కు చేరాయి. ఇందులో 3,39,09,708 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

చదవండి : Coronavirus Lockdown : లాక్ డౌన్ ల కాలం వచ్చేసింది..కరోనా ఫిఫ్త్ వేవ్ భయంతో ఆ దేశంలో మళ్లీ పూర్తిస్థాయి లాక్ డౌన్

ఇదే సమయంలో 4,65,349 మంది మృతి చెందాడు. గడిచిన 24 గంటల్లో 11,787 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 5,754 కేసులు ఉండగా, 49 మంది మరణించారు.

చదవండి : Corona Update : స్వల్పంగా తగ్గిన రోజువారీ కరోనా కేసులు

వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుంది. ఇప్పటివరకు 115.79 మందికి కరోనా వ్యాక్సినేషన్ పూర్తైంది. శుక్రవారం 51.59 మందికి కరోనా వ్యాక్సినేషన్ ఇచ్చారు. దేశంలోని అనేక గ్రామాలు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నాయి.