Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేడే లాస్ట్.. తెగని మణిపూర్ అశం, ఆఖరిలో అధిర్ హైలైట్

ఈ అంశం చివరి రోజైన నేడు కూడా హాట్ హాట్ గానే ఉండనుంది. అయితే దీనికి తోడు అధీర్ రంజన్ సస్పెన్షన్‌ కూడా ప్రస్తావనకు రానుంది. ఈ రెండు అంశాలపైనే విపక్షాలు సభలో అలజడి రేపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది

Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేడే లాస్ట్.. తెగని మణిపూర్ అశం, ఆఖరిలో అధిర్ హైలైట్

Updated On : August 11, 2023 / 9:16 AM IST

Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. కాగా సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి మణిపూర్ హింసకు సంబంధించిన అంశం ప్రాధాన్య అంశంగా ఉంది. వాస్తవానికి సమావేశాలు ప్రారంభానికి ముందే మీడియా ముందు ఈ అంశంపై ప్రధాని మాట్లాడినప్పటికీ సభలో మాట్లాడించేందుకు విపక్షాలు పట్టు పట్టాయి. ఒకరంగా చెప్పాలంటే.. ఈ సమావేశాలు మొత్తంగా మణిపూర్ అంశం చుట్టూనే తిరిగాయి. దీన్ని ఆధారం చేసుకుని ప్రభుత్వంపై అవిశ్వాసం కూడా పెట్టాయి. కానీ గురువారం జరిగిన ఓటింగులో అది వీగిపోయింది.

Luna 25 Mission: 47 ఏళ్ల తర్వాత చంద్రుడి మీదకి లూనా 25 పంపిన రష్యా.. చంద్రయాన్-3 కంటే ముందే చంద్రుడి మీద దిగుతుందట

ఈ అంశం చివరి రోజైన నేడు కూడా హాట్ హాట్ గానే ఉండనుంది. అయితే దీనికి తోడు అధీర్ రంజన్ సస్పెన్షన్‌ కూడా ప్రస్తావనకు రానుంది. ఈ రెండు అంశాలపైనే విపక్షాలు సభలో అలజడి రేపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సభా కార్యక్రమాలను అడ్డుకున్నందుకు గాను కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరిపై గురువారం సస్పెన్షన్ వేటు పడింది.

No Confidence Motion: ఆవులు, గేదెల్ని కూడా లెక్కిస్తారు, మా లెక్కలు ఒద్దా? ఆర్ఎస్ఎస్ పేరు ప్రస్తావిస్తూ జేడీయూ నేత ఫైర్

కాగా, అవిశ్వాస తీర్మానంపై ప్రధాని స్పందిస్తూ, కాంగ్రెస్‌తో సహా మొత్తం ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. యూపీఏ హయాంలో జరిగిన స్కామ్‌లను ఏకరువు పెడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ పాలిత ప్రధానులను ప్రస్తావించారు. ఇక అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కంటే ముందే విపక్షాలు లోక్ సభ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం ఓటింగ్ నిర్వహించగా మూజువాణి ఓటుతో తీర్మానం విఫలమైంది.