నేడు, రేపు భారత్ బంద్

Today Tomorrow Bharat Bandh 657
ఢిల్లీ : కార్మికులు సమ్మెబాట పట్టారు. నేడు, రేపు భారత్ బంద్ కు పిలుపు ఇచ్చారు. ఇవాళ, రేపు కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నారు. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ సమ్మె చేపట్టారు. 12 డిమాండ్లతో కార్మిక లోకం సమ్మెకు దిగింది.
సమ్మెలో 10 ట్రేడ్ యూనియన్లు పాల్గొంటున్నాయి. బీజేపీ అనుబంధ యూనియన్ మినహా మిగతా అన్ని యూనియన్లు సమ్మెకు మద్దుతు ప్రకటించాయి. తెలంగాణ, ఏపీలో ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపాయి. అలాగే ఆటో, క్యాబ్ వాహన కార్మిక సంఘాలు కూడా సమ్మెలో పాల్గొననున్నాయి. సార్వత్రిక సమ్మెకు రైతు సంఘాలు మద్దతిస్తున్నట్లు పేర్కొన్నాయి.
సమ్మెతో ప్రధానంగా రవాణ వ్యవస్థ స్తంభించనుంది. బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి.