ఎన్నికల ప్రలోభాలు : రూ.3వేల 274 కోట్లు పట్టివేత

  • Published By: vamsi ,Published On : April 30, 2019 / 05:35 AM IST
ఎన్నికల ప్రలోభాలు : రూ.3వేల 274 కోట్లు పట్టివేత

Updated On : April 30, 2019 / 5:35 AM IST

ఎన్నికలవేళ మద్యం ఏరులై పారిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకు ప్రతీ అభ్యర్ధి కూడా మద్యంను ఎన్నికల్లో పంచినట్లు చెబుతూనే ఉన్నారు. ప్రలోభాలకు గురి చేసేందుకు ఎన్నికల్లో అభ్యర్ధులు మద్యం బాటిళ్లను పంచేందుకు తీసుకెళ్తుండగా.. పంచుతుండగా ఎన్నికల అధికారులు నిఘా వేసి పట్టుకున్న సంధర్భాలు అనేకం వెలుగులోకి వచ్చాయి.

అలా పట్టుకున్న మద్యం బాటిళ్ల లెక్క వింటే షాక్‌కు గురవ్వాల్సిందే. అవును సార్వత్రిక ఎన్నికల వేళ ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నాలుగు విడతల ఎన్నికలు జరగగా.. నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా 72 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో రూ.3వేల 274.18 కోట్ల విలువైన నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రూ. 785.26 కోట్ల డబ్బు, 249.38 విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ వెల్లడించింది.

అలాగే రూ. 1214.46 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ. 972 కోట్ల విలువైన లోహాలు, రూ. 53.167 కోట్ల విలువైన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.