Tractor Trolley Collides : ట్రాక్టర్ ఢీకొడితే..స్తంభానికి ఉన్న లైట్ వెలిగింది
చెరకు లోడ్ ఉన్న ఓ ట్రాక్టర్ ట్రాలీ భాగం విడిపోయి నడి రోడ్డుపై వెనక్కి వేగంగా దూసుకొచ్చింది. ఆ రహదారిపై జనాలు రాకపోకలు సాగిస్తున్నారు.

Lights
Tractor Trolley Collides With Pole : ఫన్నీ..ఫన్నీగా జరిగే కొన్ని ఆక్సిడెంట్స్ కు సంబంధించిన వీడియోలు నవ్వులు తెప్పిస్తుంటాయి. అయితే..కొన్ని మాత్రం భయకరంగా ఉంటాయి. ఎవ్వరికి నష్టం జరగపోతే..అందరూ ఊపిరిపీల్చుకుంటారు. కానీ..అదే ఘోరం జరిగితే..మాత్రం కొన్ని కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోతుంటాయి. ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Read More : TSRTC : అద్భుతమైన పాట పాడిన ఆర్టీసీ డ్రైవర్..ట్వీట్ చేసిన సజ్జనార్
చెరకు లోడ్ ఉన్న ఓ ట్రాక్టర్ ట్రాలీ భాగం విడిపోయి నడి రోడ్డుపై వెనక్కి వేగంగా దూసుకొచ్చింది. ఆ రహదారిపై జనాలు రాకపోకలు సాగిస్తున్నారు. కేకలు వేసుకుంటూ..దానిన ఆపేందుకు కొంతమంది ప్రయత్నించారు. కానీ..వారి ప్రయత్నాలు ఏవీ సక్సెస్ కాలేదు. తప్పుకొండి..తప్పుకొండి..అంటూ ఇతర వాహనదారులకు సూచించారు. లోడ్ తో ఉండడం..వేగంగా దూసుకొస్తుండడంతో ఏమి జరుగుతుందనే టెన్షన్ నెలకొంది.
Read More : Train Booking : వారం రోజుల పాటు రైలు రిజర్వేషన్లు బంద్..ఎందుకు ?
వెనక్కి వెళ్లి…రోడ్డుపై ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. హమ్మయ్య అని అనుకున్నారందరూ. అయితే..అప్పటి వరకు చీకటి ఉన్న ఆ ప్రాంతానికి వెలుగు వచ్చింది. ఏందబ్బా అని పైకి చూస్తే..ట్రాక్టర్ ఢీకొనడంతో..స్తంభానికి ఉన్న లైటు వచ్చింది. ఇలా కూడా బల్బును వెలగనీయవచ్చా ? అంటూ నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
जान माल का नुकसान तो नहीं हुआ लेकिन दूसरा बल्ब चालू हो गया
????? pic.twitter.com/wIf2nhW1jM— Doctor Gulati L L B (@DRGulati80) November 12, 2021