ఆ రాష్ట్రంలో మాత్రమే : ట్రాఫిక్ జరిమానాలు సగం తగ్గించారు

  • Published By: madhu ,Published On : September 10, 2019 / 12:51 PM IST
ఆ రాష్ట్రంలో మాత్రమే : ట్రాఫిక్ జరిమానాలు సగం తగ్గించారు

Updated On : September 10, 2019 / 12:51 PM IST

కొత్త రూల్స్ ప్రకారం.. వెహికల్ తీయాలి అంటేనే బెంబేలెత్తిపోతున్నారు వాహనదారులు. భారీగా ఫైన్లు పడుతుండడంతో పరేషాన్ లో ఉన్నారు. వేలకు వేల జరిమానాలతో షాక్ అవుతున్నారు. వేస్తున్న ఫైన్స్ కట్టాలంటే బండి అమ్మినా అంత డబ్బు వచ్చే పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా కొత్త ఫైన్స్ పై నిరసనలు వ్యక్తం అవుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దిగివస్తున్నాయి. దీనికి తగ్గట్టుగా మొదటగా గుజరాత్ రాష్ట్రం స్పందించింది. ఫైన్ల విషయంలో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతలతో.. జరిమాలను సగం తగ్గించాలని నిర్ణయించింది. ఈ విషయంపై గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం మీడియాతో మాట్లాడారు. 

> హెల్మెట్ లేకుండా వాహనం డ్రైవ్ చేస్తే రూ.1,000 ఉన్న ఫైన్ ను రూ.500కి తగ్గించారు. 
> డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉంటే రూ. 5వేల ఉన్న జరిమానాను రూ.3వేలకు కుదించింది.
> సీటు బెల్టు పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తూ రూ.1,000గా ఉన్న జరిమానాను రూ.500కి తగ్గించింది. 
> లైసెన్స్, ఆర్సీ, పీయూసీ, ఇన్సూరెన్స్ ఇతరత్రా పేపర్లు లేకుంటే రూ.1,000 ఉన్న జరిమానాను రూ. 500కి తగ్గించారు గుజరాత్ సీఎం.
> ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1,000గా ఉన్న ఫైన్ ను రూ.100కి తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
> పొల్యూషన్ వెహికల్ రూ.10వేలు ఉన్న జరిమానాను రూ.1,000 (స్మాల్ వెహికల్స్), రూ. 3వేలకు (భారీ వాహనాలు) తగ్గించింది గుజరాత్ ప్రభుత్వం.

Read More : పబ్‌జీ ఆడొద్దన్నందుకు తండ్రిని చంపాడు
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ప్రమాదాలు నివారించాలనే లక్ష్యంతో నిబంధనలు రూపొందించడం జరిగిందంటోంది కేంద్రం.