BRS : లోక్ సభలో టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్పు

గతేడాది అక్టోబర్ లో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తున్నట్లుగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.

BRS : లోక్ సభలో టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్పు

TRS changed BRS

Lok Sabha BRS : తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ను భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మార్చిన విషయం తెలిసిందే. లోక్ సభలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ లోక్ సభ సచివాలయం ఉత్తర్వులు జారీ చేసింది. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు లోక్ సభ సచివాలయం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా ఆదేశాల మేరకు లోక్ సభలో పార్టీ ఫ్లోర్ లీడర్ గా కొనసాగనున్నట్లుగా నామా నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఆదేశాల ఉత్తర్వులు అందాయని తెలిపారు. లోక్ సభలో బీఆర్ఎస్ తరపున తొమ్మిది మంది సభ్యులు ఉన్నట్లుగా లోక్ సభ సచివాలయం తమ తాజా బులిటెన్ లో పేర్కొంది.

Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం.. అర్థరాత్రి లఖిత అనే విద్యార్థిని మృతి

పార్టీ పేరు మార్చాలని లోక్ సభ చైర్మన్, పార్టీ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వర్ రావు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చైర్మన్ ఆమోదంతో పార్లమెంట్ హౌస్ బులిటెన్ విడుదల చేసింది. ఈ సందర్భంగా అన్ని పార్టీలకు చెందిన సభ్యుల వివరాలు, పార్టీల వారిగా సభ్యుల సంఖ్యను లోక్ సభ డిప్యూటీ సెక్రటరీ ఉత్తమ్ ప్రకటించారు.

గతేడాది అక్టోబర్ లో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తున్నట్లుగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. దీంతో బీఆర్ఎస్ పేరుతోనే పార్టీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.