విశ్వాసం లేని టర్కీ.. అప్పుడు ఇండియా ఎంత సాయం చేసిందో మర్చిపోయి.. ఇప్పుడు ఆ దేశం.. పాకిస్థాన్ కి ఆయుధాలిస్తోంది..
టర్కీకి భారత్ గతంలో పెద్ద సాహాయమే చేసింది. 2023లో ఆ దేశంలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.

India vs Pakistan war
India Pakistan War: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ దాడులు చేసింది. ప్రతిగా పాకిస్థాన్ భారత్ పై డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు పాల్పడుతూ.. భారత్ ఆర్మీని రెచ్చగొడుతుంది. అయితే, పాక్ దాడులను భారత్ సమర్ధవంతంగా తిప్పికొడుతుంది.
అవన్నీ టర్కీవే..
పాకిస్థాన్ ఆర్మీ గురువారం భారీ స్థాయిలో భారత్ లోని సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్ దాడులు చేసింది. దాదాపు 300 నుంచి 400 డ్రోన్లను ప్రయోగించింది. వాటిని భారత్ సమర్ధవంతంగా కూల్చేసింది. అయితే, ఆ శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షించారు. అవన్నీ టర్కీ (ఇప్పుడు తుర్కియే)కి చెందిన ‘ఆసిస్ గార్డ్ సోగర్’ డ్రోన్లుగా ధ్రువీకరించారు.
సాయాన్ని మర్చి ద్రోహం..
టర్కీకి భారత్ గతంలో పెద్ద సాహాయమే చేసింది. 2023లో ఆ దేశంలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ దేశంలో భారీగా నష్టం వాటిళ్లింది. భారీ సంఖ్యలో మరణాలుసైతం సంభవించాయి. ఆ సమయంలో టర్కీకి అండగా నిలిచిన తొలిదేశం ఇండియానే. ‘ఆపరేషన్ దోస్త్’ పేరుతో భారీగా మానవతా సాయాన్ని మోదీ ప్రభుత్వం అందించింది. భారీ భూకంపంతో అనాథులుగా మారిన ప్రజలకు భారత్ అండగా నిలిచింది. బాధితులకు ఆహారం, మందులు సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కిసాన్ డ్రోన్లను భారత ప్రభుత్వం పంపింది. కానీ, టర్కీ సాయాన్ని మర్చి ద్రోహం తలపెడుతుంది. ఉగ్రమూకలకు నిలయంగా మారిన పాకిస్థాన్ భారత్ పై దాడులు చేస్తుంటే.. దానికి ఆయుధ సామాగ్రిని టర్కీ సరఫరా చేస్తుంది.
టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కు తొలి నుంచీ భారత్ అంటే విపరీతమైన ద్వేషం. ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయన బహిరంగంగా వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడిని కూడా టర్కీ ఖండించలేదు. ప్రస్తుతం భారత్ పై దాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్ దేశానికి ఆయుధ సామాగ్రిని టర్కీ అందిస్తుంది.