Tushar Kanta Das : ‘పెన్ మ్యాన్ ఆఫ్ ఒడిశా’.. అతని లైబ్రరీలో వేల కొద్దీ పెన్నులు
చాలామందికి రకరకాల హాబీలు ఉంటాయి. ఒడిశాకు చెందిన తుషార్ కాంత దాస్‌కి పెన్నులు సేకరించే హాబీ ఉంది. అలా ఆయన లైబ్రరీలో ఎన్ని పెన్నులు ఉన్నాయో తెలుసా?

Tushar Kanta Das
Tushar Kanta Das : ఒక్కొక్కరికి ఒక్కోరకమైన హాబీ ఉంటుంది. కొందరు స్టాంపులు, కొందరు పుస్తకాలు.. ఇక తుషార్ కాంత దాస్ అనే వ్యక్తి గురించి చెప్పుకోవాలి. అతనిని ‘పెన్ మ్యాన్ ఆఫ్ ఒడిశా’ అని పిలుస్తారు.. అంటే ఏ రేంజ్‌లో పెన్నుల కలెక్షన్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. అతని గురించి.. అతని పెన్నుల కలెక్షన్ గురించి తెలుసుకుందాం.
ఒడిశాకు నయాగఢ్ జిల్లాకు చెందిన 47 సంవత్సరాల తుషార్ కాంత దాస్‌కి పెన్నులు సేకరించడం హాబీ.. అది ఇప్పటిది కాదండోయ్.. 10 వ తరగతి చదువుతున్నప్పుడు ప్రారంభించారట. అలా మూడు దశాబ్దాల పాటు పెన్నులు సేకరించారు. ఇక ఆయన లైబ్రరీలో రేనాల్డ్స్ నుండి హై-ఎండ్ వాటర్ మ్యాన్ వరకు ప్రతి బ్రాండ్ కు చెందిన దాదాపు 4000 పెన్నులు ఉన్నాయట. 1992 లో రేనాల్డ్ పెన్‌తో రాసేవారట.. ఆ తర్వాత ఆయన సేకరణలో బంగారు పూత పూసిన పెన్నులు, వజ్రాలు పొదిగిన పెన్నులు, జర్మనీ, యూఎస్‌తో పాటు పలు దేశాల నుండి దిగుమతి చేసిన అనేక పెన్నులు ఉన్నాయట.
United States : ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన గుమ్మడికాయ.. దానికి ఎవరి పేరు పెట్టారో తెలుసా?
పెన్నుల పట్ల తుషార్ కాంత దాస్‌కి ఇష్టం పార్కర్ పెన్‌తో మొదలైందట. 1992-2005 మధ్య రేనాల్డ్స్ బాల్ పెన్నులతో రాయడం మొదలుపెట్టి పెన్నుల ప్రేమికుడు అయ్యారట తుషార్ కాంత దాస్. తన దగ్గర ఉన్న పెన్నుల ప్రారంభ ధర రూ.5 నుండి రూ.5000 విలువ చేసే పెన్నులు ఉన్నాయట. తన బంధువులు, స్నేహితులు ఎక్కడికి వెళ్లినా ఆ ప్రాంతం నుండి పెన్ను తీసుకురావాలని అడిగేవారట తుషార్. నవంబర్ 3, 2024 ఫౌంటెన్ పెన్ డే నాటికి 10,000 పెన్నులు సేకరించాలని తుషార్ కాంత దాస్ లక్ష్యంగా పెట్టుకున్నారట. పెన్ మ్యాన్ లక్ష్యం నెరవేరాలని మనం కూడా ఆశిద్దాం.
#WATCH | Bhubaneswar, Odisha: Tushar Kanta Das, a 47-year-old man, popularly known as ‘pen man’. He collects pens and has made his home a pen library. He has collected over 4,000 pens. pic.twitter.com/BnDbaXNacF
— ANI (@ANI) November 4, 2023