Snake : మద్యం మత్తులో ఏకంగా పామునే తినేశారు
మద్యం మత్తులో ఏం చేస్తారో వారికే తెలియదు. మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు. మద్యం మత్తులో పామునే తినేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది.

Snake
Two people ate a snake : మద్యం మత్తులో కొందరు ఏం చేస్తారో వారికే తెలియదు. మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు. మద్యం మత్తులో ఏకంగా పామునే తినేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కోర్బాలో రాజు, హితేంద్ర అనే ఇద్దరు వ్యక్తులు అతిగా మద్యం తాగారు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన సగం కాలిన చనిపోయిన పాము కనిపించింది. అయితే పామును చూసి.. అది బతికే ఉందని అనుకున్నారు.
ఆ పాము ఇళ్లలోకి వెళ్లి ఎవరినైనా కాటేస్తుందని భావించిన ఇద్దరు.. దాన్ని తినేశారు. అయితే ఆ పాము అప్పటికే చనిపోయిందని, సగం కాలిపోయిందన్న విషయం కూడా తెలియకుండా తిన్నారు. అప్పటికే స్థానికులు ఆ పామును చంపి కాల్చేశారు. కానీ అది పూర్తిగా కాలలేదు. దీంతో సగం కాలిన పామును తీసుకెళ్లి.. డ్రెయిన్ దగ్గర పడేశారు. కానీ ఇదేమీ తెలియని మత్తులో ఉన్న రాజు, హితేంద్ర ఆ పామును తిన్నారు. అప్పటికే సగం కాలి ఉండగా.. అందులో సగం పామును ఇద్దరూ కలిసి తినేశారు. ఆ తర్వాత పామును విసిరేశారు.
పామును తిన్న వారికి కళ్లు తిరిగినట్టు అయి.. తిన్నది అంతా అక్కడే కక్కేశారు. అనంతరం వారు సొమ్మసిల్లి పడిపోవడంతో స్థానికులు వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వైద్యం చేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. కాగా అది విషపూరితమైన కట్ల పాము. అది కరిచిన 15 నిమిషాల్లో మనిషి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. అది చనిపోయినా.. దాని విషం అందులో ఉండటంతో వారు కూడా ప్రమాదంలో పడ్డారు.